సమాజంలో మహిళలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటం గొప్ప పరిణామం అని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు అన్నారు.
సమాజంలో మహిళలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటం గొప్ప పరిణామం అని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు అన్నారు. అనంతరం బిజెపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళ మోర్చా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి జెండా ఎగరాలంటే మహిళ మోర్చా అన్ని స్థాయిలలో పటిష్టం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయ్యాలని గౌతమ్ రావు గారు సూచించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కార్పోరేటర్లు మహాలక్స్మీ రామన్ గౌడ్, ఉమా రమేష్ యాదవ్, సుప్రియా గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్యోతి, నీరజా, కళావతి, రమ్యా, మాధవీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment