పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.*

*పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.*



*రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి*

దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్‌ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  తన ప్రసంగంతో పార్లమెంట్‌ సెషన్స్‌ను ప్రారంభించారు. 

బీఆర్‌ఎస్‌, ఆప్‌ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు భారత్‌ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!