ఆదాని, అంబానిలతో నాకు సంబంధంలేదు.. వారిని సమర్ధించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు..

ఆదాని, అంబానిలతో నాకు సంబంధంలేదు.. వారిని సమర్ధించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు.. కానీ సోషల్‌ మీడియాలో కొందరి రాతలు చూస్తుంటే ఏవగింపు కలుగుతోంది. అవి వారిలోని అక్కసునే కాదు, శాడిజాన్ని కూడా చాటుతున్నాయి. 
వ్యాపారం అన్న తర్వాత లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. ఎంతటి పారిశ్రామికవేత్త అయినా రిస్క్‌ మీదే వ్యాపారం చేస్తాడు. లక్షలు, కోట్ల పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు పబ్లిక్‌ ఇష్యూకి కూడా వెళుతుంటారు. వారి మీద ఎంతోమంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి
పొద్దున లేస్తే రాత్రి పడుకునేదాకా కొందరు వ్యక్తులు అదానీ, ఆంబానీ, గుజరాతీ, మోదీ అంటూ ఏడుస్తూనే ఉంటారు. ఈ ఏడ్పుగొట్టువాళ్లతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఒకప్పుడు టాటా, బిర్లాల మీద కూడా ఇలాగే ఏడ్చేవారు. 
ఆదాని, ఆంబానిలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత అనుచిత లబ్ది పొందారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే వారి మీద అస్తమానం ఏడ్చే బదులు న్యాయం పోరాటం చేయండి.. ఎవరు వద్దన్నారు?
ఈ తిక్క సన్నాసులు దేశాన్ని, జాతీయవాదాన్ని ముడిపెట్టి పెట్టి ఆనందిస్తున్నారు. ఏం.. ఒక భారతీయుడు, దేశ భక్తులు వ్యాపార రంగంలో రాణించొద్దా? ఆ స్థానంలో ఆదానియే కాదు. ఇంకెవరు ఉన్నా నేను ఇదే ప్రశ్న వేస్తాను.
తప్పు చేస్తే అదానిని శిక్షించవచ్చు. కానీ ఆయన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశ పారిశ్రామికరంగాన్ని కూలుద్దామని భావించే గుంట నక్కలను సహించాల్సిన అవసరం లేదు. 
అసలు ఈ హిండెన్‌బర్గ్‌ ఎవరు? వీరి నివేదికలను ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి.. ఈ విదేశీ సంస్థ భారతీయ పారిశ్రామిక దిగ్గజం మీద ఎంత అసూయ, అక్కసుతో విషం చిమ్ముతోందో వారి ప్రకటన తీరును జాగ్రత్తగా గమనించవచ్చు. అదానికి నష్టం జరిగిందని గిట్టని వారు చంకలు గుద్దు కోవచ్చు. కానీ ఆ కుట్రల్లో మీరు భాగస్వాములు కానవసరం లేదు. ఇదే పరిస్థితి మరో భారతీయ కంపెనీకి రావచ్చు..




Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!