మొత్తానికి రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన పాదయాత్ర ముగించారు

మొత్తానికి రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన పాదయాత్ర ముగించారు. వాస్తవానికి ఇది ఎజెండాలో లేని అంశం. సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి చివరి రోజున లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రాహుల్‌ గాంధీ గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ రోజున శ్రీనగర్‌ వచ్చి జాతీయపతాకం ఎగురవేస్తే ఇంకాస్త హుందాగా ఉండేది. 
26 జనవరి రోజున బీజేపీ కార్యకర్తలు లాల్‌చౌక్‌ దగ్గర భారీ ప్రదర్శన నిర్వహించి, జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత  కాంగ్రెస్‌ సహా లోయలోని ప్రాంతీయ పార్టీలకు, ఉగ్రవాద మద్దతుదారులకు గుబులు పుట్టింది. అందుకే తప్పని పరిస్థితుల్లో వాళ్లు కూడా లాల్‌చౌక్‌ రాక తప్పలేదు. 
ఆర్టికల్‌ 370 రద్దయిన తర్వాత జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం ఇతర రాష్ట్రాల తరహాలోగా జాతీయ జనజీవన స్రవంతిలో కలిసింది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా, ఉపాధి అవకాశాలు పెరిగాయి. అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఉగ్రవాదం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద సంస్థలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడూ ప్రయత్నిస్తున్నా, ఉగ్రవాద సంస్థలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ఇదంతా ఆర్టికల్‌ 370 రద్దు పుణ్యమే. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ని మళ్లీ తీసుకొస్తామంటోంది. అంటే కశ్మీర్‌ కల్లోలంగా ఉండటమే వారికి ఇష్టమని భావించవచ్చా?
కాంగ్రెస్‌ తానొక జాతీయ పార్టీని అనే విషయాన్ని మరచిపోయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రాంతీయ పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ తరహాలో సంకుచితంగా  సంకుచితంగా మాట్లాడుతోంది. దేశ భద్రత విషయంలో రాజీ పడినంతమాత్రన ఆ పార్టీకి కొత్తగా కలిగే లాభాలు కూడా ఏమీ లేవు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!