వద్దంటే కుదరదు, మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం పోతుందని ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కీలకమైన వార్త వైరల్ అవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోవచ్చనే వార్త వైరల్ అవడం ప్రారంభమైంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, వైధ్య సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సిద్దం అయ్యింది. వ్యాక్సినేషన్‌ పక్రియ ప్రారంభించి చాలా రోజులు అయినా కూడా ఇప్పటికి కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.

వ్యాక్సిన్‌ ను ప్రతి రోజు లెక్క ప్రకారం ఇంత మందికి అని వేయాలని రూల్‌ పెట్టారు. కాని కొందరు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడుతున్న కారణంగా ఆలస్యం అవుతుంది. వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు వద్దంటు వ్యాక్సినేషన్‌ కు రాకుంటే వారికి మళ్లీ వ్యాక్సిన్ ఇచ్చేది లేదు అంటూ కేంద్రం ప్రకటించింది. అలాగే వారి స్థానంలో వెంటనే మరొకరికి కూడా వ్యక్సిన్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.

ప్రతి రోజు ఎంత మందికి అనుకుంటే అంత మందికి పూర్తి చేయాలని, వద్దు అన్న వారిని బలవంతం చేయకుండా ఇంట్రెస్ట్‌ గా ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయించారు. మొదటి దశలో వ్యాక్సిన్‌ ను వరుసగా ఆరోగ్య కార్యకర్తలకు మున్సిపల్ సిబ్బందికి ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వద్దన్న వారికి ముందు ముందు ఇవ్వాలంటే మాత్రం ఇవ్వను అంటున్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!