అది రైతుల ఉద్యమమా?. ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమమా?.. లేక రైతుల ముసుగులో జరుగుతున్న ఖలిస్తానీల ఉద్యమమా?.

అది రైతుల ఉద్యమమా?. ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమమా?.. లేక రైతుల ముసుగులో జరుగుతున్న ఖలిస్తానీల ఉద్యమమా?. కెనడాలో ఖలిస్తానీ సమర్ధకులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని జస్టిన్ ట్రుడో  మద్దతు ఇచ్చిప్పుడే అనుమానం ఎందుకు రాలేదు?..
ఇందిరా గాంధీని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ సమర్ధక ఖలిస్తానీల కారణంగా సిక్కులపై అన్యాయమైన దాడులు జరిగాయి.. కాల క్రమంలో ఖలిస్తాన్ ఉద్యమం అంతమై పంజాబ్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత ఇంత కాలానికి మళ్లీ ఖలిస్తాన్ భూతాన్ని తిరిగి లేపుతున్నది ఎవరు?
ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడల్లా చట్టాలను రద్దు చేయమనే డిమాండ్ తప్ప ఒక్క మెట్టూ దిగి రాలేదు.. అప్పుడే అర్థం కాలేదా?.. వీరి లక్ష్యం రైతులకు న్యాయం చేయడం కాదని.. రైతుల మేలు కోసం తెచ్చిన చట్టాలను ఇంత మొండిగా వ్యతిరేకించడంలో మతలబు ఏమిటో?
రైతుల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నది ధనిక రైతులు, మండీ కమిషన్ల ఏజెంట్లు కాదా?.. అన్ని వేల ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వారి డీజిల్ ఖర్చు? మీ పంచభక్ష ఫలహారాలు, మసాజులు, విందులు, వినోదాల ఖర్చులు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు?
ట్రాక్టర్ ర్యాలీ రిపబ్లిక్ డే రోజునే ఎందుకు జరపాల్సి వచ్చింది? అనుమతి ఇచ్చిన రూట్లలో కాకుండా ఇతర మార్గాల్లో దూసుకు రావడం.. పోలీసులపై కత్తులు, రాడ్లోతో దాడి చేయడం.. విధ్వంసం సృష్టించడం దేనికి సంకేతం?
జాతీయ జెండా ఎగుర వేసే స్థానంలో ఖలిస్తానీ (?) ఎందుకు ఎగురు వేశారు? ఒక వేళ అది ఖలిస్తానీ జెండా కాదు సిక్కుల జెండా అని వాదిస్తే, సిక్కు మతానికి రైతుల ఉద్యమానికి లింక్ ఎందుకు? మోదీ ప్రభుత్వం సిక్కులకు ఏమీ అన్యాయం చేయలేదు కదా? అన్నట్లు మధ్యలో ఈ ఎర్ర జెండాల గోలేంటి?
ఢిల్లీలో జరిగిన హింసతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నాయి రైతు సంఘాలు.. ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు, మీ చుట్టూ ఉన్న శక్తులపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నా అర్థం చేసుకోలేనంత మూర్ఖత్వమా మీది?
గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిపై ఈ విధంగా దాడి చేయడానికి భారత ప్రజాస్వామ్యం మీద దాడి అని ఎందుకు భావించరాదు?
ఓ విక్రమార్కా ఈ ప్రశ్నలన్నింటికీ తెలిసీ జవాబు చెప్పకుంటే నీ తల వెయ్యి వక్కలు ఏమీ కాకపోవచ్చు.. ఎందుకంటే దేశ ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసిపోయాయి అంటూ మాయమైపోయాడు బేతాళుడు..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!