బ్రెజిల్ కు భారత్ కరోనా వ్యాక్సిన్, సంజీవననితో పోల్చిన బ్రెజిల్ ప్రధాని.
ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఔషధసాయంలో భాగంగా వ్యాక్సిన్ మైత్రీ పేరుతో ఈ టీకాలను భారత్ పొరుగు దేశాలకు అందిస్తోంది. రెండు మిలియన్ మోతాదులను తీసుకోవడానికి బ్రిటన్ అంగీకరించింది. కరోనా మహమ్మారిపై పోరాడటానికి భారతదేశం తయారు చేసిన టీకా..మానవాళికి ఉపయోగపడుతుందని, పలు దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. అయితే ఇండియాలో తయారైన రెండు మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లు బ్రెజిల్‌కు శనివారం చేరాయి.

అయితే… వ్యాక్సిన్లు చేరుకోవడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉండగా ఇండియా వ్యాక్సిన్ సరఫరా చేయడంపై.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన ఆయన హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు… భారత వ్యాక్సిన్ తెచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ చిత్రాన్ని పోస్ట్ చేసిన బొల్సెనారో.. “వ్యాక్సిన్ ఎగుమతి చేసినందుకు భారత్‌కు ధన్యవాదాలు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇండియాతో భాగస్వామ్యం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది” అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోడీ సమాధానమిస్తూ.. ఆరోగ్య సంరక్షణపై తమ సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. కాగా.. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ నేతృత్వంలో సీరం అభివృద్ది చేసిన రెండు మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను బ్రెజిల్‌కు శుక్రవారం ఇండియా ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే
Comments
Post a Comment