ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు
ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు. ఇప్పుడిస్తా, అప్పుడిస్తా అని వూరించి, వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు. అందరినీ మోసం చేసే..., ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను..ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు.
7.5 శాతం, పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా...మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా..?
అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా...స్వతంత్రంగా పని చేయనిచ్చారా ?
ఫాం హౌజ్ ల కూసోని పి.అర్.సి రాయించినవా కేసీఆర్ ?
ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేసి, ఆ కమిటీ ఏం రాయాలే.., ఎంత రాయాలే..., ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి HRA 6 శాతం తగ్గించటం దారుణం, మోసం. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్, ఉద్యోగుల ను మోసం చేసినవ్. 7.5% PRC ఇచ్చి CPS 10% తగ్గిస్తారు. 30 శాతం ఉన్న సి.పి.ఎస్ ఉద్యోగికి ఈ పి.అర్.సి ద్వారా జీతం పెరగదు. పైగా 2.5 శాతం జీతం తగ్గుతది.
31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా. ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43 శాతం ఫిట్ మెంట్ ఇయ్యాలి. ఉన్న ఉద్యోగులు మన జనాభా కు సరిపోయినట్లు వున్నారా ?
జనాభా ప్రాతిపదికన లేరు. ఉద్యోగులపై పని భారం పెరిగింది.ఇంకా కమిటీలు, రిపోర్ట్ లు అని కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి. ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు. సమైక్య పాలకులు 25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. పి.అర్.సి వేసిన వెంటనే ఐ.అర్ ఇవ్వడం సంప్రదాయం. కానీ ఈ సర్కార్ ఐ.అర్ కూడా ఇవ్వలేదు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్.అర్. ఏ తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వం.
Comments
Post a Comment