నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన 'జై హింద్' నినాదం వెనుక ఓ హైదరాబాదీ..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన 'జై హింద్' నినాదం వెనుక ఓ హైదరాబాదీ..
హైదరాబాద్‌కు చెందిన అబిద్ హసన్ సాఫ్రాని 1911లో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ చదువు కోసం జర్మనీ వెళ్లారు. అక్కడ సుభాష్ చంద్రబోస్ ప్రసంగం విని ప్రభావితుడయ్యారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక తాను కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామినవుతానని బోస్ తో తెలిపారు. 'ఇలా చిన్న విషయాలకే పరిమితమైతే జీవితంలో పెద్ద లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేవు' అని నేతాజీ అన్నారు. దీంతో అబిద్ హసన్ చదువు ఆపేసి సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా చేరిపోయారు. ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ లో మేజర్‌గా పని చేశారు.
అప్పట్లో భారతీయ సైనికులంతా పరస్పరం పలకరించుకోడానికి 'నమస్తే, నమస్కార్, రామ్ రామ్, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుం..' పదాలు వాడేవారు. ఇన్ని పదాల బదులు దేశ భక్తిని చాటే ఒకే పదం కావాలని నేతాజీ భావించారు. ఇందు కోసం సరైన పదం సూచించాలని అందరినీ కోరారు. అప్పుడు అబిద్ 'జై హిందుస్తాన్' అని సూచించారు. ఆ తర్వాత దాన్ని కుదించి 'జై హింద్' అని మార్చారు. 'జై హింద్' నినాదం బోస్‌కు నచ్చడంతో వెంటనే ఆమోదించారు.
సుభాష్ చంద్రబోస్ తో చివరి వరకూ ఉన్న అనుచరుల్లో అబిద్ హసన్ సాఫ్రాని ఒకరు. ఆజాద్ హింద్ ఫౌజ్ పతనం తర్వాత ఆయన కొన్నేళ్ల పాటు సింగపూర్ జైలులో ఉన్నారు. ఐఎన్ఏ కేసు విచారణ ముగియగానే జులు నుంచి విడుదలై 1946లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా అందులో కొనసాగలేకపోయారు..
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అబిద్ హసన్ సాఫ్రాని విదేశాంగ శాఖలో చేరారు. వివిధ దేశాల్లో సేవలు అందించిన తర్వాత 1969లో పదవీ విరమణ చేశారు. తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 1984లో ఆయన మరణించారు. అబిద్ హసన్ సాఫ్రాని పేరులో 'సాఫ్రాని'కి ఒక ప్రత్యేకత ఉంది. హిందువులు విశ్వసించే త్యాగానికి చిహ్నమైన సాఫ్రాని (కాషాయం)ని తన పేరులో చేర్చుకున్నారు.
(జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి)

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!