కరోనా వచ్చిన పురుషుల్లో కొత్త సమస్యలు, సైంటిస్టులు చెప్పిన సంచలన విషయాలు.
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే. ఇది సాధారణ కోవిడ్ 19 కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. దీంతో మళ్లీ జనంలో భయాలు మొదలయ్యాయి. అయితే, అసలు యూకేలో కనిపించి, ఇప్పుడు భారత్‌లో వ్యాపించిందేమో అని ఆందోళన కలిగిస్తున్న కొత్త రకం వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..? బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారికి అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కరోనావైరస్ సోకిన పురుషుల్లో అత్యంత సాధారణ కోవిడ్ లక్షణం ఒకటి ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా సోకిన పురుషుల్లో వృషణాల్లో వాపు, నొప్పితో పాటు క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
పురుషుల్లో కరోనా సోకిన తర్వాత అధిక జ్వరంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోంటున్నారని నిపుణులు ఇటీవలి అధ్యయనంలో హెచ్చరించారు. కోవిడ్ జ్వరం.. పురుషుల వృషణాలు దెబ్బతిని వాపుకు కారణమవుతుందని తేలింది. జ్వరం, నిరంతర దగ్గు, రుచి లేదా వాసన కోల్పోవడం వంటివి కోవిడ్ మూడు ప్రధాన లక్షణాలుగా అందరికి తెలిసిందే. అయితే అధిక జ్వరం సాధారణంగా 38C లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కరోనావైరస్‌తో అధిక జ్వరం లక్షణంతో పోరాడిన పురుషుల్లో వృషణ కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు.
అస్సాం యూనివర్శిటీ అధ్యయనంలో కోవిడ్-19 గణనీయమైన సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందనే ఆధారాలను సైంటిస్టులు వెల్లడించారు. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రపంచ ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పురుషులు మహిళల కంటే SARS-CoV-2 వ్యాధికి అధికంగా గురవుతారని గత అధ్యయనాల్లో వెల్లడైంది. పురుష సంతానోత్పత్తిపై కోవిడ్-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Post a Comment