భావ ప్రకటనా స్వేచ్ఛ మరీ హద్దులు మీరుతోంది.

భావ ప్రకటనా స్వేచ్ఛ మరీ హద్దులు మీరుతోంది. కేవలం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికే జాతి వ్యతిరేకులు దీన్ని ఉపయోగిస్తున్నారని చాలా సందర్భాల్లో గమనించాం.
సయోని ఘోష్ అనే బెంగాలి నటి, గాయని పరమశివున్ని అవమానించడం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెటిజర్లు మండిపడే సరికి తన ట్విట్టర్ ఖాతాను 2010లో ప్రారంభిస్తే, 2015లో ఎవరో హ్యాక్ చేసి ఈ పోస్టు పెట్టారని, ఆ తర్వాత వదిలేశానని నంగనాచి కబుర్లు చెబుతోంది సయోని.. మరి అప్పుడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? హిందూ మతాన్ని మాత్రం కించపడుస్తున్న సయోనిపై మేఘాలయ మాజీ గవర్నర్ తథాగతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో మరో ఫిర్యాదు కూడా నమోదైంది.
స్వయంప్రకటిన మేతావులు, అభ్యు'దయ్య'వాదులు ఇలాంటి చర్యలను ఎలాగూ ఖండించకపోగా వారికే అండగా నిలుస్తారు. మరి ఈ దేశంలో 'ఇంకా' మెజారిటీ సంఖ్యలోనే ఉన్న మతస్తులకేమైంది. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు వారి మొద్దు చర్మం సహకరించడం లేదా?

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!