ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడితే అవహేళన చేసిన వారు అద్దంలో మీ మొహాలు చూసుకోండి.. మీ తెలుగు మాటల్లో స్పష్టత ఎంత ఉంది?..
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడితే అవహేళన చేసిన వారు అద్దంలో మీ మొహాలు చూసుకోండి.. మీ తెలుగు మాటల్లో స్పష్టత ఎంత ఉంది?.. ఎంగిలిపీసు ముక్కలు లేకుండా నాలుగు వాక్యాలు మాట్లాడ గలరా?
మీకు అదికూడా చేత కాలేదు కదూ?..
మోదీజీ తన మాతృభాష కాకపోయినా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఆహ్వానించాలి.. ' దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్..' అని చాటిన మన తెలుగు కవి గురజాడ అప్పారావు గురుంచి ప్రస్థావించి, దేశ ప్రజలకు పరిచయం చేయడం గర్వించాల్సిన సందర్భం..
ప్రధాని మోదీ గతంలో తమిళ కవి తిరువళ్లువర్ సూక్తులను ఆ భాషలోనే చెప్పినప్పిడు తమిళ ప్రజలు ఆనంద పడ్డారు.
మన తెలుగు వారు మాత్రం ప్రధాని ఎలా మాట్లాడాడు చూడండి అని అవహేళన చేస్తున్నాం.. అందుకే గురజాడ అప్పారావు పంతులు అన్నారు 'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్..'
#NarendraModi #PMOIndia
Comments
Post a Comment