ఎమ్మెల్యే పొలాల కోసం కాలువ నిర్మాణం.. అసలు విషయం అది కాదంటున్న అధికారులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్ కోసం అక్రమంగా కాలువ తవ్వించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ కాలువ రసమయి పొలాల కోసం కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతపై టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు

ఎమ్మెల్యే పొలాల కోసం కాలువ నిర్మాణం.. అసలు విషయం అది కాదంటున్న అధికారులు

 | Samayam Telugu | Updated: 17 Jan 2021, 11:29:00 AM

రేపాక గ్రామ పరిధిలో 200 ఎకరాల పంట పొలాల కోసం అధికారులు కాలువ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ కాలువ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్ కోసం అక్రమంగా కాలువ తవ్వించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ కాలువ రసమయి పొలాల కోసం కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతపై టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, గుండారం గ్రామంలో మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పొలాలు ఉన్నాయి. ఆయన వాటిని ఫామ్ హౌస్‌లా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ పొలాల గుండా అధికారులు కాలువను నిర్మిస్తున్నారు. ఇది అక్రమంగా నిర్మిస్తున్నారని, రసమయి ఫామ్ కోసమే నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేత పోతి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేస్తు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది వైరల్ కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు.



ఎమ్మెల్యే రసమయి కాలువ నిర్మాణం కోసం తన పొలం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులతో పాటు ఇతర రైతులు కూడా అదే విషయం చెప్పారు. రేపాక గ్రామ పరిధిలో 2 వందల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కాలువ నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు చెప్పారు. దీంతో రసమయిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!