భారతదేశంలో ఒక రాష్ట్ర #గవర్నర్ కు నెల జీతం 3.5 లక్షల రూపాయలు. దాంతోబాటు ప్రభుత్వ బంగళా , కారు ,సేవకులతో బాటు అధికారం.
భారతదేశంలో ఒక రాష్ట్ర #గవర్నర్ కు నెల జీతం 3.5 లక్షల రూపాయలు. దాంతోబాటు ప్రభుత్వ బంగళా , కారు ,సేవకులతో బాటు అధికారం. ఇంత మంచి గౌరవం, స్థానం వదిలేసి సంస్థ లేదా పార్టీ పిలవగానే ఏ షరతులూ లేకుండా వచ్చేసిన వ్యక్తి శ్రీ #కుమ్మనం_రాజశేఖరన్...
అది కూడా గెలుస్తాము అనే గ్యారంటీ ఏమాత్రం లేని ఎన్నికల్లో పోటీ చేయడానికి.
2017 - 18 లో మిజోరం రాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాజశేఖరన్ గారికి జీతం రూపంలో లభించింది మొత్తం 32 లక్షల రూపాయలు. అయితే ఆయన 2019 లో తిరువనంతపురంలో పోటీచేయడానికి నామినేషన్ పత్రాలతోబాటు తనకున్న ఆస్తి గురించిన అఫిడవిట్ లో బ్యాంక్ ఖాతాలో ఒక లక్ష రూపాయలు, చేతిలో 513 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 31 లక్షల రూపాయలను ఆయన మిజోరాం లోని అనాథాశ్రమం, మరియు సామాజిక సంస్థలకు దానం చేసి, కట్టుబట్టలతో వచ్చేశారు.
బాటనీలో డిగ్రీ, జర్నలిజంలో పోస్టుగ్రాడ్యుయేట్ అయి, 1976 లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో దొరికిన ఉద్యోగాన్ని వదిలేసి , సమాజసేవ కోసం వచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్త శ్రీ కుమ్మనం రాజశేఖరన్ . 👏👏
Comments
Post a Comment