అప్రెంటిస్‌షిప్‌ ఐవోసీఎల్‌లో 1,340 ఖాళీలు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రిఫైనరీల్లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
* టెక్నీషియన్‌ అప్రెంటిస్‌/ ట్రేడ్‌ అప్రెంటిస్‌ 
విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, ఎల‌క్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌. 
ఖాళీలు: 1,340 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతితోపాటు ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత. 
వయసు: 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 9. 
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: నవంబరు 17 https://iocl.com/

ప్రభుత్వ ఉద్యోగాలు 
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ 

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సేఫ్టీ)-12, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌)-02, సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-01, డిప్యూటీ మేనేజర్‌ (ఎల‌క్ట్రికల్‌)-01 
అర్హత: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా. 
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు ఫీజు: రూ.500 
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అక్టోబరు 24 నుంచి నవంబరు 30 వరకు. 
వెబ్‌సైట్‌: http://powergridindia.com/

ప్రవేశాలు 
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు 

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) ప్రాంగణాల్లో 2019 సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది. 
కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, యూజీ డిగ్రీ లేదా యూజీ డిప్లొమా, బీఎఫ్‌టెక్‌, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 
వయసు: యూజీ ప్రోగ్రాములకు 23 ఏళ్లు మించకూడదు. పీజీకి వయఃపరిమితి లేదు. 
ఎంపిక: రాతపరీక్ష, సిట్యువేషన్‌ టెస్ట్‌/ గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 28. 
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: 2019 జనవరి 3. 
వెబ్‌సైట్‌: https://nift.ac.in/

ఫెలోషిప్స్‌ 
డీఆర్‌డీవోలో పరిశోధన ఖాళీలు 

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో - సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (సీహెచ్‌ఈఎస్‌ఎస్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-05, రిసెర్చ్‌ అసోసియేట్‌-02. 
కాల వ్యవధి: రెండేళ్లు. 
స్టైపెండ్‌: జేఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.25,000;  రిసెర్చ్‌ అసోసియేట్లకు నెలకు రూ.40,000. 
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ, నెట్‌/ గేట్‌ ఉత్తీర్ణత. 
వయసు: జేఆర్‌ఎఫ్‌ ఖాళీలకు 28 ఏళ్లు, రిసెర్చ్‌ అసోసియేట్లకు 35 ఏళ్లు మించకూడదు. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
చివరి తేది: ప్రకటన వెలువడిన తేదీ (అక్టోబరు 20) నుంచి 21 రోజుల్లోపు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!