*"ఖర్గే గారు, చరిత్రను అంగీకరించండి!"**
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ గారి మాటల్లో తప్పేం ఉంది ఖర్గే?
కేశబోయిన శ్రీధర్,
జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా
విదేశీ దురాక్రమణదారుని కట్టడం తొలగిపోయి, భవ్యమందిరం సాకారం కావడం నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం కాకుండా మరేమవుతుంది? ఈ చరిత్రను విస్మరించడం భారతీయుల ఔత్సాహాన్ని తక్కువ చేయడమే. భారత్ మీద దండెత్తిన పరాయి దేశీయులు ఖాసిం, ఘజనీ, ఘోరీ, తైమూర్, బాబర్ వంటి వారు ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డారో చరిత్ర సాక్ష్యం.
ఈ విదేశీ పాలకులు ఇక్కడి ప్రజల మానప్రాణాలు దోచుకొని, ధార్మిక క్షేత్రాలను కొల్లగొట్టి ధ్వంసం చేయడం వాస్తవం కాదా? అది గుర్తించకుండా, బ్రిటిష్ పాలన అంతమైన ఆగస్టు 15నేం నిజమైన స్వాతంత్ర్య దినం అని చెప్పడం అర్థ సత్యం కాదా?
తప్పులు వెతకాలంటే… అసలు దేశ విభజనకు కారణమైన పార్టీ ఏది? అఖండ భారత విభజనను మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలా? కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ వారు ప్రారంభించడం వాస్తవం కాదా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలరా?
రాహుల్ గాంధీ మాట్లాడే “భారత రాజ్య వ్యవస్థ మీద పోరాటం” అనేది ఎంతవరకు అర్బన్ నక్సల్స్ భావజాలంతో కలసి ఉంటుందో ఆయన వివరణ ఇవ్వాలి. భారత్ నీ దేశం కాదా? ఈ దేశం మీదే పోరాడతావా?
మోహన్ భగవత్ గారు చెప్పిన దృష్టికోణం చరిత్రలోని వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే. కాబట్టి ఖర్గే గారు, చరిత్రను తిరగరాయడం కాదు, వాస్తవాన్ని అంగీకరించడం అవసరం.
జై భారత్!
Comments
Post a Comment