కేజ్రీవాల్ యొక్క కొత్త ఆరోపణ: హర్యానా ప్రభుత్వం డిల్లీకి విషం కలుపుతోందా? | #Kejriwal #Haryana #Yamuna #DelhiPolitics

ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఆరోపణను అరవింద్ కెజ్రీవాల్ చేస్తున్నాడు. హర్యానా ప్రభుత్వం డిల్లీకి పోయే యమునా జలాల్లో విషం కలుపుతోందని ఆరోపణ చేయడం అతని అలవాటైన హిట్ అండ్ రన్ విధానంలో భాగమే.

కెజ్రీవాల్ అలవోకగా అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాలను దోచుకుంటాడు. అయితే, న్యాయస్థానంలో నిలబడి వాటిని రుజువు చేయవలసి వచ్చినప్పుడు, ఇవి “రాజకీయ ఆరోపణలే” అంటూ క్షమాపణలు చెప్పడంలో అతడికి పెద్ద అనుభవం ఉంది.

అన్నా హజారే వంటి సమాజసేవకులు ఇప్పటికే అతడిని అసహ్యించుకొని, సంబంధాలు పూర్తిగా తెంచుకున్నారు. అతనితో కలిసి పనిచేసి దూరమైన వ్యక్తులు కుమార్ విశ్వాస్, స్వాతి మల్లి వాల్ వంటి వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

కెజ్రీవాల్ తాను చెప్పే అబద్ధాలను నమ్ముతారనే భ్రమలో ఉన్నా, ఈసారి డిల్లీ ప్రజలు అతనికి మరిచిపోలేని పాఠం చెబుతారని నేను నమ్ముతున్నాను. ఇది శిశుపాలుని నూరవ తప్పు లాంటి దుస్థితి. ఇక శిక్షించకుండా వదిలే పరిస్థితి లేదని భావిస్తున్నాను.

కేశబోయిన శ్రీధర్, జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా & అధ్యక్షులు, చెతన ఫౌండేషన్.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!