లేడీస్ వాష్‌రూమ్‌లో..ఇదేం పని రాహుల్ జీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన కలకలంగా మారింది. అంటే రాహుల్‌గాంధీకి దక్కుతున్న క్రేజ్‌ను చూసి అధికార బీజేపీ అయోమయంలో పడిపోయిందేమో అనుకోకండి….సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే అయోమయంలో పడ్డారు. అవాక్కయ్యారు. సొంత పార్టీ నాయకుడి క్రేజ్‌తో ఇలా అవడం ఏంటని అనుకోకండి. జరిగింది తెలిస్తే మనం కూడా అదే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతాం.
ఇంతకీ విషయం ఏంటంటే….గుజరాత్ పర్యటనలో రాహుల్‌గాంధీ కొన్ని ఇబ్బందికర క్షణాలను ఎదుర్కొన్నారు. ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన బుధవారం చోటా ఉదయ్‌పూర్‌లో అక్కడి యువతను కలుసుకున్నారు. మీటింగ్ తర్వాత రాహుల్.. టాయిలెట్‌కు వెళ్లారు. అయితే పొరపాటున రాహుల్.. లేడీస్ కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌లోకి ప్రవేశించారు. వాష్‌రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు గుజరాతీ భాషలో రాసి ఉన్న కారణంగా రాహుల్ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. అయితే రాహుల్ వెంట ఉన్న ఎస్పీజీ కమాండోలు ఆయన్ను ఫాలో అయ్యారు. వెంటనే తన పొరపాటును తెలుసుకున్న రాహుల్.. లేడీస్ వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు మహిళలు రాహుల్ ఫోటోలను తీశారు. ఇంకేముంది అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. మహిళల వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న రాహుల్ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందర్నీ స్పందింపచేస్తున్నాయి.
కాగాం అంతకుముందు బేటీ బచా వో బేటీ పడావో కార్యక్రమం పేరును అమిత్‌షా కే బేటేకో బచావ్ గా మార్చాలని రాహుల్ చురకలు వేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జయ్‌షాపై ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ ఈ పంచ్ వేశారు. జయ్‌షా కంపెనీ పెట్టుబడులు 16 వేల రెట్లు పెరిగాయని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ విధానాల వల్ల అన్నిరంగాలు దెబ్బతిన్నాయని, అందులోంచి జయ్ కంపెనీ ఒక్కటే పైకి లేచిందని అన్నారు. దేశానికి కాపలాదారును అని చెప్పుకునే ప్రధాని మోడీ దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
Comments
Post a Comment