హిందువులంటే కోర్టులకి అంత లోకువా?

హిందువులంటే కోర్టులకి అంత లోకువా?

ఢిల్లీ లో దీపావళి కి టపాకాయలు నిషేధించిన సుప్రీం కోర్టు;

మూడు గంటలే టపాకాయలు కాల్చుకోవాలన్న పంజాబ్ హర్యానా హైకోర్టు;

శబరిమల ఆలయంలో మహిళలకి ప్రవేశం పై రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ;

హిందూ కులాల మధ్య గొడవల పెట్టే అవకాశం ఉన్న కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధించమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న సుప్రీం కోర్టు;

బర్మాకి చెందిన రోహింగ్యా ముస్లింలని దేశంలోకి అనుమతించాలని, రక్షించాలని ముస్లింల ఆందోళన, వారికి వత్తాసు పలికిన సుప్రీం కోర్టు; ఇవన్నీ ఒక్క వారం రోజుల వ్యవధిలో గౌరవ కోర్టులు ఇచ్చిన తీర్పులు.

ఇవన్నీ చూస్తున్న సగటు హిందువుకి ఏమనిపిస్తుంది? హిందువుల విషయంలో మాత్రమే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి. ఇతర మతాలకి సంబంధించి కూడా పర్యావరణానికి నష్టం కలిగించేవి, స్త్రీల పట్ల వివక్ష చూపించేవి ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా కోర్టులు ఇలాగే తీర్పు చెబుతాయా? అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అత్యంత అమానవీయమైన ట్రిపుల్ తలాక్ పై స్పందించడానికి మన కోర్టులకి డెబ్బై ఏళ్ళు పట్టింది.

పర్యావరణ పరిరక్షణకోసం దీపావళికి టపాకాయలు బ్యాన్ చేయడం కరెక్టే అని ఒప్పుకుంటే,  రేపు ఇంకొకరు దీపావళి రోజు అందరూ దీపాలు వెలిగించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని కోర్టుకి వెళితే అప్పుడు కోర్టులు దీపాలు కూడా వెలిగించవద్దు అని చెబుతాయా? అలా చెబితే హిందువులు నోరు మూసుకుని ఆ తీర్పు పాటించాల్సిందేనా? ఇంకొంత ముందుకు వెళితే జల్లికట్టు ఆట వల్ల జంతువుల హక్కులకి భంగం కలుగుతుందని దాన్ని కోర్టులు నిషేధించాయి. హిందువులు ఇచ్చే జంతుబలులని మన ప్రభుత్వాలు నిషేధించాయి, అదే ముస్లింలు బక్రీద్ కోసం లక్షల గొర్రెలని చంపేస్తే తప్పులేదు. మొహర్రం రోజు పసిపిల్లలకి కూడా ముఖాన కత్తితో గాట్లు పెడుతుంటే బాలలహక్కులు వారికి వర్తించవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు..

పుస్తకాల్ని నిషేధించడం మంచిది కాదు; అలాగే మత ఆచారాలని ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మార్చుకోవడం లో కూడా తప్పులేదు. ఈ విషయంలో కోర్టులు, ప్రభుత్వాలు  జోక్యం చేసుకోవడం కరెక్ట్ అయితే అన్ని మతాల ఆచారాల విషయంలో జోక్యం చేసుకోవాలి, లేదా ఆ మతాలకి వదిలేయాలి. అంతేకాని ఒక మత ఆచారాలని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనే భావన కలిగేలా కోర్టులు కానీ, ప్రభుత్వాలు కానీ వ్యవహరించడం నిజమైన సెక్యులరిజం అనిపించుకోదు.అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ ప్రెసిడెంట్ కట్టం నర్సింహా రాష్ట్ర బీజేపీ ఓబీసీ ప్రచార కార్యదర్శి కేశబోయినశ్రీధర్
హైదరాబాద్ బీజేపీ ఓబీసీ ప్రెసిడెంట్ సి.విందో యదువు అభిప్రాయపడ్డారు

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!