అయోధ్యలో వంద మీటర్ల ఎత్తయిన రాముని విగ్రహం!

అయోధ్యలో వంద మీటర్ల ఎత్తయిన రాముని విగ్రహం!

సరయు నది తీరాన అయోధ్యలో భారీ శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయాలని యూపీలోని యోగి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. వివాదాస్పద రామ జన్మభూమికి సమీపంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహానికి వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. వంద మీటర్ల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్‌కు పంపించారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అవస్థీ ఈ సందర్భంగా గవర్నర్‌కు విగ్రహ ఏర్పాటుపై వివరించారు. ఇక దీపావళికి సరయు తీరాన దివాళీ హారతి ఏర్పాటు చేశారు. ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరయు తీరాన రాముని విగ్రహంతోపాటు రాముని కథను వివరించే గ్యాలరీ, ఆడిటోరియం, ఇతర వసతులను కూడా నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.195 కోట్ల డీపీఆర్‌ను కేంద్ర టూరిజం శాఖకు పంపించగా.. రూ.133 కోట్లు విడుదలయ్యాయి.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!