బాబూ రాహుల్..నువ్వు పప్పు అని పదే పదే ప్రూవ్ చేసుకోకు..! కేశబోయినాశ్రీధర్

బిజెపి కి మరో పెద్ద పండుగ రాబోతోంది. డీమానిటైజేషన్, పెట్రోలు ధరల పెంపు, GST దెబ్బ వీటన్నటి నుంచి నరేంద్రమోది ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మోది కి ఏ విషయంలోనూ వందోవంతుకు కూడా సరిపోలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు. బిజెపి కి ఇంతకన్నా పండుగరోజు మరొకటి ఉండదు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ విజయ్ సినిమా మెర్సల్  వివాదంపై ఒక ట్వీట్  చేసారు. ఆ ట్వీట్ చూసినవాళ్లకి రాహుల్ బుర్ర ఎంత గొప్పగా పనిచేస్తుందో మరోసారి అర్థం అయింది. రాహుల్ ట్విటర్ అకౌంట్ లో ప్రత్యక్షమైన ఆణిముత్యం ఇదీ..

Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don’t try to demon-etise Tamil pride by interfering in Mersal.
ఈ ట్వీట్ తెలుగు అనువాదం ఏంటంటే..?  “సినిమా అనేది తమిళ భాష, సంస్కృతి ల యొక్క వ్యక్తీకరణ, మెర్సల్ సినిమా విషయంలో వేలు పెట్టి తమిళ ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు” అని.
సినిమా అనేది తమిళ్ వాళ్ళు కనిపెట్టిన కళ కాదు, వాళ్ళ సంస్కృతికి ప్రతీక కూడా కాదు, సినిమా అనేది ఏ భాష వాళ్ళకైనా ఒక భావ వ్యక్తీకరణ సాధనం. మరి రాహుల్ టీం ఏమో expression of Tamil culture అని పేద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది.  మరీ టూమచ్ ఏంటంటే ఈ వివాదానికి తమిళ ఆత్మగౌరవానికి ముడి పెట్టడం. ఒక సినిమాలో ఒక సీన్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే అది తమిళ ఆత్మగౌరవాన్ని కించపరచడం ఎలా అవుతుంది?

తమిళనాడు లో బిజెపి మీద ఇప్పటికే ఆగ్రహం ఉన్న నేపథ్యంలో, దాన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ తాపత్రయ పడడంలో తప్పులేదు, కానీ చేసే ట్వీట్ ఏదో సరిగ్గా చేయవచ్చు కదా. అదే కమల్ హాసన్ ను చూడండి “సినిమా మీద రెండో సెన్సార్ అవసరం లేదు” అని సింపుల్ గా, వ్యంగ్యంగా చెప్పేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!