ఆనందీబెన్ సంచలన నిర్ణయం...అమిత్‌షాకు లేఖ
ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2017 ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఓ లేఖలో తెలియజేసారు. తన వయస్సును ఆమె ప్రస్తావిస్తూ, తనకు బదులు కొత్తవారు, ప్రతిభావంతులకు టిక్కెట్లు ఇవ్వాలని అమిత్‌షాను ఆమె కోరారు. అయితే పార్టీ ఏ ఇతర బాధ్యతలు ఇచ్చినా చేపట్టేందుకు, పార్టీ కోసం పనిచేసేందుకు తాను సిద్ధమేనని ఆమె తన సమ్మతిని తెలియజేశారు. ఆనందీబెన్ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి 2016 ఆగస్టులో రాజీనామా చేశారు. 75
ఏళ్లు దాటిని పార్టీ నేతలు తమ పదవులను వదులుకోవాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ట్విటర్ పోస్ట్‌లో ఆనందీబెన్ ప్రస్తావించారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్రానికి వెళ్లడంతో 2014లో మోదీ స్థానే గుజరాత్ సీఎం పదవిని ఆనందీబెన్ చేపట్టారు. పటేళ్ల ఆందోళన, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం వంటి పరిణామాల నేపథ్యంలో 2016లో ఆనందీబెన్ తన పదవికి రాజీనామా చేశారు.

Comments
Post a Comment