సీఎం కారు పోయింది
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కారును ఎవరో దొంగిలించినట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఆయన తన నీలి రంగు ‘వేగన్ ఆర్’ కారును ఢిల్లీ సచివాలయం వద్ద ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఆ కారు మాయమైంది. దానిని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియడం లేదు. ఈ కారును ఆయన ఉద్యమకారుడిగా మారినప్పటి నుంచి వాడుతున్నారు. అందువల్ల దీనిని ఆయన చాలా ప్రేమాభిమానాలతో వాడుకుంటున్నారు.
Comments
Post a Comment