5 ఏళ్లకే మొహం మొత్తేసే కాలం!
5 ఏళ్లకే మొహం మొత్తేసే కాలం!
12 ఎన్నికలు , ఎన్నో ఆటుపోట్లు 22 ఏళ్ళు అప్రతిహం గా,అదికూడా కఠిన ఆర్ధిక సంస్కరణల నేపధ్యం లో, పెంచుకున్న ఓట్ షేర్ తో అదిరా బీజేపీ అంటే..
అమ్మా అయ్యా నేను నీ ఇంటికి పెద్దకొడుకు అవుతాను అని తద్దినాలు పెట్టె పార్టీ కాదు బీజేపీ.
అందరు కి తోడు అందరు కి వికాసం అనే మూల సిద్ధాంతం పై నిర్మించి పార్టీ బీజేపీ.
నేను ముఖ్యమంత్రి అయితే మీకు 45 ఏళ్లకే పింఛను అనే పార్టీ కాదు బీజేపీ.
పేదోళ్ల ను బిచ్చగాళ్ళు చేయకుండా , అంత్యోదయం కోసం శ్రమించే పార్టీ బీజేపీ.
కులాలు మధ్య కుంపట్లు రాజేసి , దొంగ హామీలు గుప్పించి , ఆనక నెపం న్యాయస్థానాలు , కేంద్రం ప్రభుత్వం పై తోసేసే పార్టీ కాదు బీజేపీ.
ఎక్కడనుంచి ఇస్తారు ఎవరి దాంట్లో కొస్తారు అని ఇంకా ఇంకా కుల రిజర్వేషన్ లు నిర్మొహమాటం గా త్రోసిరాజన్న సాహసం గల పార్టీ బీజేపీ.
అధికారం చిక్కేక మేము ఇచ్చిన పెన్షన్లు తీసుకోవద్దు , మేము వేసిన రోడ్లు పై నడవద్దు, ఏం? మాకు ఎందుకు ఓట్లు వేయరు అని బెదిరించే పార్టీ కాదు బీజేపీ.
మాకు ఓట్లు వేసిన వాళ్ళకే కాదు ఓట్లు వేయని వారికి కూడా సేవ చేయటం మా ప్రభుత్వ ధర్మం అనే సమ న్యాయం చూపే పార్టీ బీజేపీ.
ఓట్లు కోసం స్వధర్మాన్ని విడిచిపెట్టి ఎన్నికల్లో పరధర్మాన్ని (చర్చి-మసీదు-గుళ్ళు) ఆశ్రయించే పార్టీ కాదు బీజేపీ.
మరణించినా స్వధర్మమే మేలు అని త్రికరణ శుద్ధి గా ఎల్లవేళలా హిందూధర్మం ఆచరిస్తున్న పార్టీ బీజేపీ.
నేను వస్తే కానుక లు ఇస్తా , నేను వస్తే తోఫాలు ఇస్తా అని ప్రజలకు ఉచితాలు ఇచ్చి , ప్రలోభాలకు గురిచేసి తామే కాదు ప్రజలను కూడా పాడు చేసే పార్టీ కాదు బీజేపీ.
మేము వస్తే పన్నులు సరిగ్గా కట్టిస్తా , అవినీతిని పెకిలిస్తా, పెద్ద నోట్లు రద్దు చేస్తా , నల్లధనం బయటికి రప్పిస్తా, GST అమలు చేస్తా , కఠినమైన సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పే దమ్మున్న పార్టీ బీజేపీ.
మా కులపోళ్లు, మా కొడుకులు , కూతుళ్లు , మనవళ్లు , బామ్మర్దులు ,అల్లుళ్లు మీకు నాయకులు తరతరాలుగా మీరు అంతా మాకు ఓట్లేసి మా దొడ్డి లో పాలేర్లు గా హాయిగా బ్రతకండి అనే పార్టీ కాదు బీజేపీ.
బడి పంతులు కొడుకు లు , టీ అమ్ముకునే వాళ్ళు , నీచ జాతి వాళ్ళు ను ప్రధాని లను చేసే పార్టీ బీజేపీ.
స్వార్ధం కోసం శత్రు దేశాల ఉగ్రవాదులు కు పక్కలు వేసే పార్టీ కాదు బీజేపీ.
దేశం కోసం ఉగ్రవాదులు నే కాదు వాళ్ళ దేశాల్ని కూడా మట్టు పెట్టె సత్తా గల పార్టీ బీజేపీ.
అవినీతి బురదలో కూరుకుపోయిన పందుల పార్టీ కాదు బీజేపీ
ఆ బురద లోంచి వికసించిన స్వచ్ఛమైన కమలం పార్టీ బీజేపీ.
అందుకే 29 రాష్ట్రాలు ల్లో 19 రాష్ట్రాల్లో కమల వికసిస్తుంది.
దేశం ప్రధమం , పార్టీ మధ్యం , స్వార్ధం అధమం అనే సూత్రాన్ని మనసా వాచా కర్మేణ ఆచరిస్తుంది బీజేపీ.
సర్వ జన హితాయ సర్వ జన సుఖాయ అని వాంచిస్తుంది బీజేపీ.
రండి తెలుగు తమ్ముళ్లు చెల్లెళ్ళు మోడీ అభివృద్ధి ఫలాలు మనం కూడా ఆస్వాదిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ని ఆహ్వానిద్దాం...
నవభారతం లో మన వైభవం కూడా చాటుదాం..
కేశబోయినశ్రీధర్
Comments
Post a Comment