అరిగిపోయిన రికార్డులు ఇక మూలన పారేయండి!

అరిగిపోయిన రికార్డులు ఇక మూలన పారేయండి! నోట్ల రద్దు, జీఎస్టీ .. ఇవేవీ ఇక ఎంతమాత్రం విమర్శించే అంశాలు కావు! వీటికి బహుళ జనామోదం ఉందని ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో రుజువైపోయింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, నిజాయితీపరులు ఈ చర్యల వలన ఇబ్బంది పడ్డారని, దేశం నష్టపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని ఇంకా కువిమర్శలు చేస్తూ పోతే జనం నోటితో నవ్వరు! పైగా వీటి ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఇంకా వీటినే పట్టుకుని ఎవరైనా విమర్శిస్తున్నారంటే అర్థం వాళ్ళ అక్రమార్జన కాస్తా కాకెత్తుకు పోయిందనే! :)
2019 లోక్ సభ ఎన్నికల లోగా 2018 లో జరిగే సెమి ఫైనల్స్ అంటే ఛత్తీస్ ఘర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్షాలు కొత్త ఆరోపణలు వెదుక్కుంటే మంచిది. మత తత్వం తో దేశాన్ని బిజెపి విభజిస్తున్నదని మళ్ళీ తప్పుడు కూతలు కూసినా... దొంగ హిందూ వేషాలు వేసినా కూడా ఎదురు దెబ్బలు తప్పవు! ఇంకేమిటయ్యా దారి అంటే.. మోదీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుందేమో అని కాసుక్కూర్చోవడం... లేదా బుర్రకి పదును పెట్టి కొత్త ఆరోపణలు వెదుక్కోవడం!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!