2015-16 సంవత్సరానికి 2వేల దరఖాస్తులు మూడేళ్లలో 374 మందికి రుణాల మంజూరు నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం తప్పని ఎదురు చూపులు బీసీ మంత్రి ఇలాఖలోనే అందని వ్యక్తిగత రుణాలు
బీసీలకు అందని..ఉపాధి రుణం
22 Jan 18, 02:32 PM
2015-16 సంవత్సరానికి 2వేల దరఖాస్తులు
మూడేళ్లలో 374 మందికి రుణాల మంజూరు
నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం తప్పని ఎదురు చూపులు
బీసీ మంత్రి ఇలాఖలోనే అందని వ్యక్తిగత రుణాలు
వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి రుణాల పథకం ఫలితం లేకుండా పోతోంది. రుణాల కోసం నిరుద్యోగులు వేలల్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం మాత్రం అంతంత మాత్రంగానే నిధులు విడుదల చేస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబరు వరకు 139 సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్లకు వివిధ రకాల రుణాలను అందించేందుకు రూ.250 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇందులో జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యక్తిగత రుణాలతో పాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది.
ఆదిలాబాద్ జిల్లా: వెనుకబ డిన తరగతుల వారి అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వ ఆర్థిక సహాయం అందకుండా పోయింది. ప్రతి యేటా ప్రభుత్వం స్వయం ఉ పాధి రుణాలను అందిస్తుండగా ఇవి ఇప్ప టికే ఎస్సీ, ఎస్టీలకు రెండు దఫాలుగా రాగా బీసీలకు మాత్రం స్వయం ఉపాధి రుణాలు కరువయ్యాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం మ ంజూరు చేసిన నిధులతో అదే సమయంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం 2015-16 సంవత్సరంలో ఆ నిధుల ద్వారా బీసీలకు రుణాలు మంజూరు చేసిం ది.ఇందులో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2వేల మంది బీసీ లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా వీరికి గాను జిల్లాకు సంబంధించి 437 యూనిట్లను మంజూరు చేయగా అధికారులు రెండు విడతలుగా 30 7, 67 మొత్తం 374 మందికి స్వయం ఉపా ధి రుణాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4సంవత్సరాలు గడు స్తున్నా జిల్లాలోని బీసీ లబ్ధిదారులకు నయా పైస మంజూరుకాక పోవడంపై సదరు లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీ లబ్ధిదారులకు ఎదురు చూపులే..
ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో స్వయం ఉపాధి కింద రాష్ట్ర ప్రభుత్వం రు ణాలను మంజూరు చేస్తోంది. కానీ ప్రభు త్వం గత నాలుగేళ్లుగా ఆదిలాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల స్వయం ఉపాధి రుణాల కోసం బడ్జెట్ కేటాయించక పోవడంతో లబ్ధిదారులు ఆశల పల్లకిలోనే మునిగి తేలుతున్నారు. వేల కోట్ల రూపా యలతో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడు తున్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోనే వెనుకబ డిన తరగతిలోని నిరుపేద లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలను ఎందుకు ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53శాతం ఉన్న బీసీలలో ఎందరో మంది నిరుపేదలు ఉన్నారని అంటున్నారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నిధులతోనే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది దరఖాస్తు చేసుకోగా వారికి కేవ లం 437యూనిట్లను మాత్రమే మంజూరు చేయడం ఎంత వరకు సమంజసమంటు న్నారు. ప్రభుత్వం తమకు స్వయం ఉపాధి రుణాలను ప్రకటిస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తామని ఎదురు చూస్తున్న బీసీ లబ్ధి దారులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.
నిధులు అంతంత మాత్రంగానే విడుదల..
ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి రుణాల కోసం వేలల్లో దరఖాస్తులు రాగా ప్రభుత్వం మాత్రం నిధులు అంతంత మా త్రంగానే విడుదల చేస్తోంది. దీంతో బీసీ లబ్ధిదారుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబర్ మాసం వరకు 139 వివిధ సొసైటీలు రిజిస్ర్టేషన్ చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫె డరేషన్ల కోసం వివిధ రకాల రుణాలను అం దించేందుకు రూ.250కోట్లు మంజూరు చేసి ంది. ఇందులో జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వా రా ఫెడరేషన్లను రిజిస్ర్టేషన్ చేసుకున్న వా రికి ప్రభుత్వ వ్యక్తిగత రుణాలతో పాటు సొ సైటీకి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో 139 సొసైటీలు రిజిస్ర్టే షన్ చేసుకున్నాయి. ఇందులో వాషర్‌మెన్, కో-ఆపరేటివ్ సొసైటీ, నాయీబ్రాహ్మణ సొ సైటీ, వడ్డెర సొసైటీ, సాగర, వాల్మీకి, బో య, కృష్ణబలిజ పోసాల,బట్రాజు, విశ్వ బ్రా హ్మణ, కుమ్మరి, శాలివాహన వంటి సొసై టీలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయా ఫెడరేషన్లకు సబ్సిడీ పై రు ణాలు అందజేయనుంది. ఇందులో వ్యక్తిగత రుణాలు రూ.50వేల నుంచి రూ.2లక్షల వ రకు బ్యాంకుతో సంబంధం లేకుండా అంద జేయనుంది. సొసైటీలకు బ్యాంకు లింకేజితో రుణాలు అందజేయడంతో ఆయా రుణాల కోసం 21 నుంచి 55 సంవత్సరాలు వయ స్సు ఉన్న వారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
బడ్జెట్ విడుదల పై అసంతృప్తి..
నాలుగేళ్లుగా ప్రభుత్వంలో వ్యక్తిగత రుణా లు రాక నిరాశతో ఉన్న జిల్లాలోని బీసీ ల బ్ధిదారులు గత కొన్ని రోజుల క్రితం ప్రభు త్వం సొసైటీలకు, వ్యక్తిగత రుణాల కోసం మంజూరు చేసిన రూ.250 కోట్ల బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉన్న బీసీలకు రూ. 250 కోట్లు ఏ మూలన సరిపోతాయని ప్ర శ్నిస్తున్నారు. గత యేడాది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2వేల మంది దరఖాస్తు చే సుకుంటే ప్రభుత్వం చాలి చాలనట్లుగా 437 యూనిట్లను మంజూరు చేసిందన్నారు. ఇం దులో 374 మందికి రుణాలు మంజూరు కా గా 61 మందికి రుణాలు మంజూరు కాలే దని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గత నాలు గేళ్లుగా ఎదురు చూస్తున్న బీసీ లబ్ధిదారుల కు సరైన విధంగా రుణాలు మంజూరు చే సేందుకు బడ్జెట్‌ను విడుదల చేస్తుందను కుంటే ఈ యేడాది కూడా నిరాశే ఎదురవు తుందని ఆవేదన చెందుతున్నారు.
ఇంకా ప్రారంభంకాని ఆన్‌లైన్ వెబ్‌సైట్..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇంత వరకు వ్యక్తి గత రుణాలకు నోచుకోక పోగా ప్రభుత్వం ప్రస్తుతం మంజూరు చేసిన రూ.250 కోట్ల తోనైనా వ్యక్తిగత రుణాలు లభిస్తాయనుకు న్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. ఇ ందులో ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసిన ఇంకా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించక పోవడంతో జిల్లాలోని నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణాల కోసం దరఖా స్తు చేసుకునేందుకు జిల్లా కేంద్రానికి వస్తూ నిరాశతో తిరుగు ముఖం పడుతున్నారు. ఈ బడ్జెట్‌లో కేవలం ఫెడరేషన్లకు మాత్రమే ఆ న్‌లైన్ వెబ్‌సైట్ ప్రారంభం కావడంతో వ్య క్తిగత రుణాల లబ్ధిదారులకు అన్యాయం జ రుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీలోని నిరుపేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జె ట్‌ను మంజూరు చేసి వెబ్‌సైట్‌ను ప్రారం భించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీసీ మంత్రి ఇలాఖలో బీసీలకు అందని వ్యక్తిగత రుణాలు..
అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అందంగా జి ల్లాలోని బీసీ లబ్ధిదారుల పరిస్థితి మారింది. ఒక పక్క రాష్‌ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా వారే అయినప్పటికీ జిల్లాలోని బీసీలకే రుణాలు దోరకని పరిస్థితి దాపురించింది. రాష్ట్ర మంత్రి జోగు రామన్న బీసీ మంత్రి అయినప్పటికీ బీసీలకు నాలుగేళ్లలో కేవలం 437 యూనిట్లు మంజూరు కాగా ఇందులో 374 మందికే వ్యక్తిగత రుణం మంజూరు కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నా యి. 437యూనిట్లలో ఇంకా 61 యూనిట్లకు రుణాలు మంజూరు కాకపోవడంపై ఆశ్చర్య ం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మంత్రి ఉన్న ప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతుంద ని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థమవుతుందంటు న్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి చొరవ తీసుకొని లబ్ధిదారులకు అనుగుణంగా రు ణాలు మంజూరు చేయాలని డిమాండ్ చే స్తున్నారు.
నిధులు లేవన్నారు..
రజక కులానికి చెందిన నేను వ్యక్తిగత రుణం కోసం దరఖా స్తు చేసుకుందామంటే అధికారులు నిధులు లేవంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధింవచ్చని అ నుకున్నాను. కానీ 2015-16 సంవత్సరంలో 2వేల మంది దర ఖాస్తు చేసుకోగా కేవలం 374 మందికే రుణాలను మంజూరు చేశారు. ఇక అనా టి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లవుతున్న ఇంకా రుణాలు మం జూరు కావడం లేదు.
లింగన్న, దోబీకాలనీ
ప్రభుత్వ ఆదేశాలు రాగానే దరఖాస్తులు స్వీకరిస్తాం..
ప్రభుత్వం బీసీల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 139 ఫెడరేషన్లు రిజిస్ర్టేషన్ చేసుకొని ఉ న్నా యి. కొత్తగా సొసైటీలను రిజిస్ర్టేషన్ చేసుకునే వారు ఆన్‌లైన్‌లో మీసేవా ద్వా రా రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. ఇక వ్యక్తిగత రుణాల కోసం ప్రభుత్వ ఆదేశాలు రా గానే సంబంధిత సొసైటీతో పాటు వాటి దరఖాస్తులను కూడా స్వీకరిస్తాం.
ఆశన్న , డీబీసీడబ్ల్యూవో
Comments
Post a Comment