2018 - 19 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

2018 - 19 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు
పీఎం జీవన్‌ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి.
జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు.
దళిత సంక్షేమానికి కోసం రూ.56వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508కోట్లు
చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు.
ఆరోగ్య రంగానికి 1.38లక్షల కోట్లు.
గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు.
ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు. సౌభాగ్య పథకానికి రూ.16వేల కోట్లు.
అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర.
ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు. వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు.
మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు.
క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు
రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా. దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి.
విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.
2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు.
ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు. వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం.
బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు.
వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.
జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు.
గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.
ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం
ఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు.
దిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయింపు.
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకు విస్తరిస్తాం.
42 మెగాఫుడ్‌ పార్కులను పటిష్టం చేస్తాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.1400కోట్లు
ఆపరేషన్‌ గ్రీన్‌ కోసం రూ.500కోట్లు.
పర్‌ఫ్యూమ్స్‌, ఆయిల్స్‌ కోసం రూ.200కోట్లు.
గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000కోట్లు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం.
వ్యవసాయం దేశంలో ప్రధాన రంగం. క్లస్టర్‌ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. హార్టీకల్చర్‌కు ప్రాధాన్యం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15శాతం పెరుగుతాయి.
రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నాం. వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం.
2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నాం.
డీబీటీ విజయవంతమైంది. లబ్ధిదారునికి వీలుగా రాయితీలు అందుతున్నాయి.
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నాం.
సులభతర వాణిజ్యం విధానంలో ఆర్థికవృద్ధి వేగంగా జరుగుతుంది.
సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌ల్లో పేద‌ల‌కు ల‌బ్ధి. ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో బ‌లీయ‌మైన ఆర్థికశ‌క్తిగా భార‌త్‌.
ప్రపంచంలో ఏడో ఆర్థికశక్తిగా ఎదిగాం. త్వరలోనే ఐదో ఆర్థిక‌శ‌క్తిగా భార‌త్ అవతరించనుంది.7.2-7.5 జీడీపీ ఎదుగుద‌ల ఉంటుంది.
ప‌న్నుల విధానం జీఎస్‌టీలో సుల‌భ‌త‌ర‌మైంది. పెద్ద‌నోట్ల ర‌ద్దులో భారీగా ధ‌నం వినియోగంలోకి వ‌చ్చింది
గ‌త నాలుగేళ్ల‌లో తీసుకొన్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ఎఫ్‌డీఐ(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు పెరిగాయి.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్ ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!