తిరుమల వెంకన్నపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిపై కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకన్న కేవలం కోటీశ్వరుల దేవుడని, పేదలను కాపాడలేడని ఆయన పేర్కొన్నారు. సొంత హుండీనే కాపాడలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతాడు అని ప్రశ్నించారు. ఆయన కోట్లాది రూపాయిలు ఇచ్చే వాళ్లకే దేవుడని, డబ్బులేని వాళ్లు ఆయన దర్శనం కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సిందేనని అన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకు అనవసరమని చెప్పారు. కనిమొళి చేసిన ఈ వ్యాఖ్యలపై కెశబోయిన శ్రీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!