పవన్ యాత్ర లో ఘోర అవమానం
..పవన్ యాత్ర లో ఘోర అవమానం
దేశం అంటే ఇంతో ఇష్టమని , భారతమాత అంటే ఎంతో ప్రేమ అని చెప్పే పవన్ కళ్యాణ్..తాజాగా ఆయన చేస్తున్న ప్రజా యాత్ర లో జాతీయ జెండా కు ఘోర అవమానం చోటు చేసుకుంది. ఈ ఘటన కొండగట్టు వద్ద జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పవన్.. బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు.
ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. వాటిని పవన్ బౌన్సర్లు తీసుకొని నిర్లక్ష్యంగా నలిపి పక్కకు పడేశారు. ప్రస్తుతం వాటి తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఇక కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ రూ.11 లక్షల విరాళం అందజేశారు.
Comments
Post a Comment