ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలు: పరిపూర్ణానంద స్వామి అని అనరూ

ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలు: పరిపూర్ణానంద

ఎస్సీ, ఎస్టీ, బీసీలే మొట్టమొదటి హిందువులని, ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలేనని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కళాశాలలో జరుగుతున్న ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలలో శనివారం పరిపూర్ణానంద పాల్గొన్నారు. శివుడు, ఆంజనేయస్వామి ఆలయాలు లేని ఊరు ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తదితర వర్గాలు వెళ్లి వారిని పూజిస్తున్నారని, ఇది సమాజం నేర్పించిన నైతిక సిద్ధాంతమని ఆయన అన్నారు. ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కాదని అమ్ముడుపోని భారతీయ విద్యార్థి పరిషత్‌ అని అన్నారు.

Comments