పవన్ కల్యాణ్ మాట్లాడని విషయాలెన్నో ఉన్నాయి కొండగట్టులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి జనసేన పండగ చేసుకుంటున్న పార్టీ అధినేత వపన్ కల్యాణ్ కు పది ప్రశ్నలు;
మల్లన్నసాగర్ పోకుండ కొండగట్టుకు పోవుడు ఎందుకు?
ప్రభుత్వ విధానాలు బాగున్నయ్ అన్నంక ఇంక ప్రజల్లోకి ఎందుకు?
తెలంగాణ ఒచ్చిందని 12 రోజులు అన్నం మానేసినొడు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తడు?
పవన్... సొల్లు ఆపి, ప్రజల సమస్యలు ముందు తెలుసుకో. సింగరేణి, వేములఘాట్, గోలివాడ, వట్టెం, గౌరారం పోయి తెలుసుకో. కార్మికులు కర్షకులు ఏం బాధలు పడుతున్నరో తెలుసుకో.
పరీక్షలు పెట్టిన సంవత్సరం అయినా టీఎస్పీఎస్సీ రిజల్ట్ ఇవ్వదు.
ఉద్యోగాలు ఇవ్వరు. అడిగినవా ఎపుడన్నా?
ఫూలే అంబేడ్కర్ ఫోటోలు పెట్టుకున్నవు - నేరెళ్ళ ఇసుక లారీల కింద నలిగిన దళితుల బతుకుల గురించి చెప్పగలవా నీ మిత్రుడు కేటీఆర్ కు?
రండి. తెలంగాణ 'ప్రశ్నించుడు' ఎట్ల వుంటదో సూపుదం!
Comments
Post a Comment