భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన కొసం డిమాండ్ చేస్తున్న పాకిస్థాన్ ప్రజలు
: ఇది వినడానికి కొంచెం ఆశ్చ్యర్యంగా ఉండొచ్చు కాని నిజం. దేశ స్వాతంత్ర్యం కొసం బ్రిటీషు వారిని ఏదిరించి పోరాడిన అత్యంత ప్రభావశీల స్వాతంత్ర్య సమరయోధుడైన షాహీద్ భగత్ సింగ్ కు పాకిస్థాన్ లొని అత్యున్నత శౌర్య పురస్కారమైన ” నిషాన్-అ-హైదర్” అవార్డు నివ్వాలన్న డిమాండ్ పాకిస్థాన్ లొ ఊపందుకుంటుంది. అంతేకాకుండా బ్రిటీష్ వారు, భగత్ సింగ్ ను 1931 లొ ఉరితీసిన లాహొర్ లొని షాద్మన్ చౌక్ ప్రాంతంలొ అతి పెద్ద భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సంధర్బంగా పాకిస్థాన్ లొని షాహీద్ భగత్ సింగ్ మెమొరియల్ ఫౌండేషన్ చైర్మన్ “ఇంతియజ్ రషీద్ ఖురేషి” మాట్లాడుతూ భగత్ సింగ్ అతి గొప్ప విప్లవకారుడన్న విషయం ప్రపంచం మోత్తానికి తెలుసని, పాకిస్థాన్ జాతి పిత “మొహమ్మద్ ఆలి జిన్నా” కూడా అప్పట్లొ భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ భగత్ సింగ్ వంటి పరాక్రమవంతుడు మరలా ఊపఖండంలొ జన్మించడని కొనియాడిన సంగతి గుర్తు చేశారు. మతంతొ సంబందం లేకుండా భగత్ సింగ్ ను ” నిషాన్-అ-హైదర్” అవార్డుతొ గౌరవించాలని, భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రషీద్ ఖురేషి డిమాండ్ చేశారు.
భగత్ సింగ్, ఒక్క భారతదేశానికి మాత్రమే చెందిన వాడు కాదని, ఆయన మొత్తం ఉపఖండం స్వాంతంత్ర్యం కొసం పొరాడాడని తెలియజేశారు. పైగా భగత్ సింగ్ పుట్టిన ఊరు ఇప్పుడు పాకిస్థాన్ లొనే ఉందని, అతను ఉరితీయ బడ్ద లాహొర్ కూడ పాకిస్థాన్ లొ ఉంది కాబట్తి అతనిని పాకిస్థానీ గా భావించి యుధవీరునిగా గుర్తిచి గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ డిమాండ్ కు ప్రజల నుండి కూడా చెప్పుకొతగ్గ స్పందన వస్తుందటం విశేషం.
Comments
Post a Comment