యుద్ధ ట్యాంకుల కొరకు రక్షణ శాఖ ఏంత మందుగుండు కొనుగొలు చేస్తుందొ తెలుసా ??

2025 నాటికి ఇండియన్ ఆర్మీ ని పూర్తిగా ఆధునికరించే పనిలొ నిమగ్ణమై ఉన్న మోది ప్రభుత్వం 2015 నుండి 2025 వరకు ఆర్మీ ఆధునీకరణకు కావలసిన స్పష్టమైన బడ్జెట్టు ను తయారు చేసింది. ఇందులొ భాగంగా ఇప్పటికే వేల కొట్ల రుపాయల ఆయుధాలు, యుధ విమానాలు, అసాల్ట్ రైఫిల్స్ ను కొనుగొలు చేస్తుండగా, సబ్మెరైన్లను, యుధ నౌకలను, విమాన వాహక నౌకలను, మిసైల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కెల్వర్ హెల్మెట్ల వంటి  వాటిని దేశీయంగా పెద్ద ఎత్తున తయారీ ప్రారంభించారు

ఇందులొ భాగంగా ఇప్పుడు భారతదేశపు ప్రధాన యుధ ట్యాంకులయిన  T-90, T-72  ల కొసం ఏకంగా 1,00,000 రౌండ్లకు పైగా మందుగుండు ను రక్షణ శాఖ  కొనుగొలు చేయనుంది.. ఈ యుద్ధ ట్యాంకులు ప్రధానంగా  Tank-to-Tank  Battles లలొ శత్రువుల యుధ ట్యాంకులను, కంబాట్ వెహికల్స్ ను ద్వంసం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ మందుగుండు ద్వారా భారత ఆర్మీ, అదనంగా 10 రొజులపాటు తీవ్ర యుధం చేయగల సత్తాను  పొందనుంది.

మోది ప్రభుత్వం అధికారంలొకి వచ్చిన వెంటనే ఈ ట్యాంకులకు కావలసిన మందుగుండు తయారుచేసే భాద్యతను ఆర్డినెన్స్ బొర్డు ఫ్యాక్టరీకి అప్పగించినప్పటికీ, ఈ పనిలొ ఆర్ధినెన్స్ ఫ్యాక్తరీ అనుకున్న ఫలితాలు సాధించలేక పొవడంతొ, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రష్యా నుండి ఈ మందుగుందు ను కొనుగొలు చేస్తున్నారు.

ఏటువంటి పరిస్తితులనైనా ఏదుర్కొనేందుకు వీలుగా గత మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ కొసం పెద్ద ఏత్తున ఈ మందుగుండును ఉపయోగిస్తుండటంతొ కొంత షార్టేజ్ ఏర్పడింది. దీనితొ ఈ మందుగుండుతొ పాటుగా దీనిని తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీని కూడా భారత ప్రభుత్వం రష్యా నుండి కొనుగొలు చేయనుంది.

గత రెండు సంవత్సరాల కాలం నుండి ఇండియన్ నేవీ, ఏయిర్ ఫొర్స్ లు పెద్ద ఏత్తున మందు గుండును కొనుగొలు చేశాయి. కాగ ట్యాంకుల మందుగుండును ఇంత పెద్ద ఏత్తున కొనుగొలు చేయడం భారత చరిత్రలొ ఇదే మొదటిసారి.

Comments