Hats off to President : ఫ్యామిలీ ని సైతం పక్కన పెట్టిన రాస్ట్రపతి కొవింద్ గారు.

: ఇలాంటి విషయాలు మన దేశంలొ జరగడం చాలా అరుదు. ఏంత సేపు అవినీతి, బంధుప్రీతి, కమీషన్ల కొసమే పనులు చేయడం, కులం, కుటుంబం, లంచం లాంటి వార్తలు వినీ వినీ ఉన్న మనకు బహుశా ఇలాంటి వార్తలు ఆశ్చ్యర్యంగాను, అతిశయంగాను అనిపించవచ్చు.

రిపబ్లిక్ డే సంధర్బంగా ప్రతి సంవత్సరం రాస్ట్రపతి భవన్ లొ  ‘At Home’  కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం జరిగేది రాస్ట్రపతి భవన్ లొ అంటే దేశానికి సంబందిచినది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా, స్పూర్తిదాయకంగా నిర్వహించాలకున్నారు. అనవసరమైన వ్యక్తులను, దేశానికి ఉపయొగపడని ప్రముఖులను, మొహవాటపు ఆహ్వానితులను పక్కనబెట్టి …… ఉన్నతమైన వ్యక్తులతొనే ‘At Home’ కార్యక్రమమ జరపాలనుకున్నారు.

ఇందులొ భాగంగా కొవింద్ గారు తీసుకున్న మొదటి నిర్ణయం తన కుటుంబాన్ని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం. ఈ కార్యక్రమానికి తన కుమారుడు, కుమార్తెలను పిలవ వద్దని స్పష్టంగా చెప్పారట. తనతొ పాటుగా తన భార్య ను మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకు వెళ్ళారు. (ఏందుకంటే ఆమె First Lady  కాబట్టి) …. ఇక ఈ కార్యక్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తులను, గొప్ప వ్యక్తులను మాత్రమే అహ్వానించారు.

CBSE, ISC , UPSC పరీక్షలలొ అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారిని , విదేశాలలొ మెడల్స్ సాధించిన ఆరుగురు వ్రెజెలర్లను, అమర్జీత్ సింగ్ (ఫుట్ బాల్), మిలింద్ కంబ్లీ, వీర మరణం పొందిన జవానుల కుటుంబాలను, మెడల్స్ సాధించిన మరికొంత మంది క్రీడాకారులను, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతీయువకులు మాత్రమే ‘At Home’ కార్యక్రమానికి ఆహ్వానించారు.  వీరితొ పాటు ఆసియాన్ దేశాధి నేతలు, ప్రధాని, ఉపరాస్ట్రపతి, క్యాబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్దారు.

దీనితొ ఈసారి ‘At Home’  కార్యక్రమంలొ పాల్గొనే అతిధుల సంఖ్య సంఖ్య 2,325 నుండి 724 మందికి పడిపొయింది.  కొవింద్ గారు తీసుకున్న ఈ  గొప్ప  నిర్ణయానికి అందరూ స్వాగతిస్తున్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!