Mind Blowing : రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకుపొతున్న భారతదేశ పర్యాటక రంగం
పెద్ద ఏత్తున విదేశీ యాత్రికులను ఆకర్షిస్తూ పర్యాటక రంగంలొ భారతదేశం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకు పొతుంది. 2016 -17 గాను భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల సంఖ్య చరిత్రలొ మొదటిసారి 1,00,00,000 (ఒక కొటి) సంఖ్యను దాటి పొవడం విశేషం. ఈ విదేశీ యాత్రికుల ద్వారా భారతదేశానికి 27 బిలియన్ డాలర్లు అనగా 1,75,000 కొట్లు ఆదాయం వచ్చినట్టు కేంద్ర పర్యటక శాఖా మంత్రి “ఆల్ఫన్సొ కన్నధనం” మీడియా సమావేశంలొ తెలియజేశారు.
ఈ సంధర్బంగా పర్యాటకశాఖా మంత్రి అల్ఫాన్సొ మాట్లాడుతూ పర్యాటక రంగ వలన భారతదేశానికి పెద్ద ఏత్తున విదేశీ మారక ద్రవ్యం సమకూరిందని తద్వారా స్థూల దేశీయ ఉత్పత్తి లొ పర్యాటక రంగం వాటా 6.88% చేరిందని పేర్నొన్నారు. దీని వలన దాదాపు 12% మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, 2016 సంవత్సరం కన్నా 2017 లొ పర్యాటక రంగం 15.2% అభివృధిని సాధించిందని ఆయన తెలియజేశారు. దీనివలన ప్రపంచంలొ అత్యధికంగా పర్యాటకులు పర్యటించే దేశంగా 2016 లొ 65 వ స్థానంలొ భారత్, 2017 నాటికి Top 40 లొ స్థానం సంపాదించడం గర్వకారణమని, స్వదేష్ దర్శన్ పధకం ద్వారా ఈ ఘనతను సాధిచగలిగామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగంలొ భారత్, భవిష్యత్తులొ మరింత వేగంగా దూసుకుపొతుందని, అందుకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కొత్తగా మరొక 11 ప్రాజెక్టులను మొదలు పెట్టామని ఆయన తెలియజేశారు.
ఇందులొ భాగంగా ఈశాన్య రాస్ట్రాలను, అండమాన్ నికొబార్ దీవులను కూడా అభివృధి చేస్తున్నామని, విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి గొల్ఫ్ కొర్టులను, పొలొ కొర్టులను నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి అల్ఫాన్సొ తెలిపారు. కాగా భారత్ కు కెనడా, బ్రిటన్, అమెరికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, రష్యా, మలేసియా, జర్మనీ, చైనా దేశాల నుండి ఏక్కువగా విదేశీ పర్యాటకులు రావడం విశేషం.
Comments
Post a Comment