జాతీయం తాజా వార్తలు టెలికాం సంచలన నిర్ణయం : ఇక నుండి 13 అంకెల ఫోన్ నెంబర్
జాతీయం తాజా వార్తలు టెలికాం సంచలన నిర్ణయం : ఇక నుండి 13 అంకెల ఫోన్ నెంబర్
వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు… 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది. ఇలా 13 అంకెల సంఖ్యని ఫాలో అవ్వడం వలన వినియోగదారునికి మరింత సెక్యూరిటీ ఏర్పడుతుంది అని , అలాగే నెంబర్ ను ఎవరు పడితే వారు తీసుకుని స్పామ్ చెయ్యడానికి వీలు లేకుండా కొత్తగా యాడ్ అయ్యే ఆ సంఖ్యలు నిరోధిస్తాయని , అలాగే ఇప్పటిదాకా స్పామ్ చేస్తున్న మొత్తం నెట్వర్క్స్ అన్నీ నిరుపయోగంగా అయిపోతాయని తెలిపింది. ఈ సరికొత్త టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే ఆ మూడు అంకెలు సెన్సార్ కి , అలాగే మొబైల్ డేటా ఆపరేషన్స్ కి లింక్ అవుతాయని.అప్పుడు సిమ్ లు కాల్ కు మాత్రమే కాకుండా డైరెక్ట్ గా డేటా కనెక్షన్ ని నియంత్రించడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
కాగా జనవరి 8 నాటికే దీనిపై టెలీకం శాఖ నుంచి తమకు ఆదేశాలు అందాయనీ… దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని బీఎస్ఎన్ఎన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఈ ఏడాది జూలై 1 నుంచి 13 అంకెల ఎం2ఎం నంబర్ విధానాన్ని అమలు చేయాలని టెలీకం శాఖ నిర్ణయించింది. ఆరోజు నుంచి కొత్తగా తీసుకునే అన్ని మొబైల్ ఫోన్ నంబర్లలో 13 అంకెలు ఉంటాయి. ఇప్పటికే 10 అంకెల నంబర్ వాడుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోపు కొత్త నంబర్‌కు మారాల్సి ఉంటుంది…’’ అని వెల్లడించారు.
మరోవైపు ఇదే విషయాన్ని టెలీకం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ధ్రువీకరించింది. ‘మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌లో స్పెక్ట్రమ్, రోమింగ్, క్యూవోఎస్‌కు సంబంధించి’ టెలీకం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు లిఖిత పూర్వకంగా స్పందన తెలిపింది. టెలీకం శాఖ సిమ్ ఆధారిత ఎం2ఎం డివైజ్‌ల కోసం 13 అంకెల నంబరింగ్ సిరీస్‌ను ఆమోదించిందనీ.. ఇప్పటికే చలామణీలో ఉన్న 10 అంకెల నంబర్‌తో పాటు పనిచేసే విధంగా కొత్త నంబరింగ్ విధానం ఉంటుందని వెల్లడించింది.
By sources
Comments
Post a Comment