ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత మధ్యప్రదేశ్ లో
ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత
మధ్యప్రదేశ్ లో
రాష్ట్రంలోని బడ్‌వానీ పట్టణంలోని ఆశ్రమంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆశ్రమంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమంలో కిచిడీ, మిఠాయి తీన్న వెంటనే భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు.
By sources
Comments
Post a Comment