భారత అటవీ ప్రాంతలను రక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం. పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన భారత ఫారెస్ట్ రిపోర్టు 2017 వెల్లడించిన ముఖ్యాంశాలు
భారత అటవీ ప్రాంతలను రక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం.
పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన భారత ఫారెస్ట్ రిపోర్టు 2017 వెల్లడించిన ముఖ్యాంశాలు :
🔸కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో, దేశంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,021 చదరపు కిలోమీటర్ పెరిగింది.
🔸భారత అటవీ విస్తీర్ణం దేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.39 శాతంగా నమోదైంది.
🔸ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగించి నమోదు చేయబడిన మొత్తం అటవీ ప్రాంతం 7,08,273 చదరపు కిమీ గా అంచనా వేయబడింది.
🔸మోదీ ప్రభుత్వం చేపట్టిన బహుళ అటవీస్టేషన్ కార్యక్రమాలు విజయవంతం కావడం వల్లనే ఈ పెరుగుదలకు కారణమని పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
🔸అధిక అటవీ ప్రాంతం విస్తీర్ణం ఉన్న దేశాలలో భారతదేశం ఇప్పుడు 10 వ స్థానంలో ఉంది
🔸వార్షిక అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదు చేసిన దేశాలలో 8వ స్థానంలో ఉంది.
🔸గరిష్ట కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే దట్టమైన అటవీప్రాంతం విస్తీర్ణంలో కూడా గరిష్ట పెరుగుదల నమోదయింది.
🔸ఈ అటవీప్రాంతాల పెరుగుదల అనేది వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలతో కుదిరిన "పారిస్ ఒప్పందం" పై భారతదేశం యొక్క నిబద్ధతను పెంచింది.
Comments
Post a Comment