తెలంగాణా తాజా వార్తలు వైరల్ : కేటీఆర్ కు లెటర్ రాసిన 6 ఏళ్ల పాప…తెలంగాణాలో కలకలం
వర్ధమాన రాజకీయ నాయకుల్లో కేటీఆర్ కి ఉన్న ఇమేజ్ వేరు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ సాధిస్తున్న విజయాలు , సోషల్ నెట్వర్క్ లలో ప్రజల సమస్యలను తెలుసుకుని ఆయన స్పందిస్తున్న తీరు చాలా మంది అభినందించడం మనం చూసే ఉంటాము. ప్రస్తుతం , కేటీఆర్ ఇమేజ్ , ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉంది అంటే ఒక 6 ఏళ్ల పసి పాప అతనికి ఉత్తరం రాసి పంపించేంత.
వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే ఒక పాప కేటీఆర్ కి ఉత్తరం రాసింది. తన కాలనీ లో రోజూ ముష్టి ఎత్తుకుంటున్న వారిని చూసి చలించిపోయిన ఈ పాప మంత్రి కేటీఆర్ కి వెంటనే ఉత్తరం రాసి పంపింది. తన వీధిలో ముష్టివాళ్లు చాలా మంది తిరుగుతున్నారు అని , వారికి ఏదైనా డబ్బులు వచ్చేలా సాయం చేయమని అడిగింది. అంతే కాకుండా , తన దగ్గర కిడ్డీ బ్యాంకు లో 2000 రూపాయల దాకా డబ్బులు ఉన్నాయి అని, కావాలంటే ఆ డబ్బులు మీకు ఇస్తాను , వాళ్లకు హెల్ప్ చెయ్యండి అంకుల్ అంటూ ఉత్తరం లో పేర్కొంది. ఆమె ఉత్తరం లో రాసిన మాటలు ఆమె మాటల్లోనే చెప్పాలంటే Dear :- KTR UNCLE I am supriya 6 years old studying I class ST.PIOUS X KIDS SCHOOL ALWAL HILLS KIDS ARE BEGGING AT SUCHITRA JUNCTION. I request you provide you food, shelter and education for them in this regard. I would like to donate my kiddi bank amount 2000 Rupees by meeting you. Thank K. SUPRIYA ALWAL ఈ పాప రాసిన ఉత్తరం చూసి నెటిజన్లు ఆమెను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇంత చిన్న వయసులోనే ఎదుటి వారిని చూసి బాధపడి స్పందించిన ఈ పాప మనస్సుని అభినందిస్తున్నారు. ఈ విషయం పై కేటీఆర్ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సాయం చెయ్యడానికి వయసు, అంతస్థు కాదు , మనసు ఉండాలి అని ప్రూవ్ చేసింది కదా ఈ పసి పాప.
By sources
Comments
Post a Comment