#Big_Breaking_News ప్రపంచ వ్యాప్తంగా #దావూద్_ఇబ్రహీం ఆస్తులను బయట పెట్టిన భారత్ ........... Must Read ...........

అండర్ వరల్డ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కు భారత్ పెద్ద షాక్ ఇచ్చింది. దావూద్ ఇబ్రహీం కు బ్రిటన్ తొ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల వివరాలను భారత్ బయట పెట్టినట్టు BBC World, The Times  మీడియా సంస్థలు  తెలియజేశాయి.

ముఖ్యంగా బ్రిటన్ లొని మిడ్ ల్యాండ్, లండన్, సౌత్ ఈస్ట్ లొ ఉన్న ఆస్తుల వివరాలను బ్రిటన్ ప్రభుత్వానికి అందించినట్టు BBC పేర్కొంది. బ్రిటన్ తొ పాటుగా స్పెయిన్, UAE,  మొరాకొ, టర్కీ,  సైప్రస్, ఆస్ట్రేలియా లలొ ఉన్న దావూద్ ఇబ్రహీం ఆస్తులను భారత ఏజెన్సీ లు గుర్తిచినట్టు బ్రిటీష్ మీడియా పేర్కొంది. దావూద్ ఇబ్రహీం,  D Gang కు సంబందించిన  హొటల్స్, ఇంద్రభవనాలు, స్థలాలు, కంపెనీలకు చెందిన    దాదాపు 48,000 కొట్ల ఆస్తుల వివరాలను భారత్ అయా దేశాలకు అందించినట్టు తెలుస్తుంది.

ఈ సంధర్బంగా బ్రిటన్ లొ ఉన్న దావూద్ ఇబ్రహీం, D Gang ఆస్తులకు సంబందించి, భారతీయ ఏజెన్సీలు అందించిన ఆస్తుల వివరాలను లండన్ కు చెందిన The Times  పత్రిక ప్రచురించింది. గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఆస్తులను జప్తు చేయించడానికి భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 

1993 ముంబాయి వరుస పేళ్ళుళ్లలొ ప్రధాన నిందితుడిన దావూద్ ఇబ్రహీం ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్, దొపిడీల ద్వారా వేల కొట్లు సంపాదించాడు. తరువాత భారత  ఏజెన్సి ల దృష్టి మరల్చడానికి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మద్య కాలంలొ అమెరికా కూదా దావూద్ ఇబ్రహీం ను మోస్టు వాంటెడ్ లిస్టులొ చేర్చింది.  ఇంటర్ పొల్ మోస్టు వాంటెడ్ లిస్టులొ మూడవ స్థానంలొ దావూద్ ఉన్నాడు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!