తెలంగాణ బీజేపీ గ్రౌండ్ రిపోర్ట్..

తెలంగాణ బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయా అంటే, నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకాలం కొంత వెనకబడి ఉన్న ఈ పార్టీ 2019 ఎన్నికల నాటికీ బలమైన పార్టీగా ఎదుగుతుందని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను 30 నుండి 35 వరకు చేర్చడానికి పార్టీ శ్రేణులు బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాల్లో పార్టీ బలం పుంజుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం యువత చూపు బీజేపీవైపే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను, అదే విధంగా కొందరు నాయకులను తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.. 


కరీంనగర్ జిల్లాలో పార్టీ బాగా పుంజుకుంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుండే పోటీకి దిగారు. ఈ ఎన్నికేల్లో ఈయన 50 వేలపైచిలుకు ఓట్లను సాధించాడు. గత ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చిన సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ పై బీజేపీ జెండా ఎగరేస్తానని దృఢ సంకల్పంతో ఉన్నారు.. 

ఇక దుబ్బాక విషయంనికి వస్తే.. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రఘునందన్ రావు బలమైన నేతగా ఎదుగుతున్నారు. గత ఎన్నికల్లో దుబ్బాక నుండి పోటీ చేసిన రఘునందన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం బీజేపీ తరపున తెలంగాణాలో బలంగా మాట్లాడగల నేత రఘునందన్ రావు అనడంలో సందేహం లేదు.. 

ఆ తర్వాత సూర్యాపేట లో కూడా బీజేపీకి గట్టి పట్టుంది. ప్రస్తుతం అక్కడ సంకినేని వెంకటేశ్వర్ రావు బలమైన నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంకినేని కేవలం రెండువేల ఓట్ల తేడాతో జగదీశ్వర్ రెడ్డిపై ఓటమి చెందారు.. స్వతంత్ర అభ్యర్థిగా ఉండి అన్ని ఓట్లు సాధించడం అంటే మాములు విషయం కాదన్నది అందరికి తెలిసిందే..

ఇక ఇదే జిల్లాలో హుజుర్ నగర్ నియోజక వర్గంలో బీజేపీ పాగా వేసేలా కనిపిస్తోంది. బోబ్బా భాగ్యరెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. యువతను ఆకర్షించడంలో భాగ్యరెడ్డి ముందున్నారు. నియోజకవర్గ సమస్యలపై గట్టిగా పోరాడుతున్నారు.. హుజుర్ నగర్ లో ఇతడికి బలమైన పోటీనే ఉంది . పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.. అయితే ప్రస్తుతం భాగ్యరెడ్డి పార్టీకోసం కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!