ఎక్కడికైనా.. మెట్రో ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.?
ఎక్కడికైనా.. మెట్రో ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.?
ఇది కదా హైదరాబాద్ వాసులు కోరుకునేది. ట్రాఫిక్ బాధలనుంచి విముక్తి కల్పించేందుకు మన ప్రభుత్వాలు మెట్రోను తీసుకొచ్చాయి.దీంతో గంటలకొద్దీ ప్రయాణం కాస్తా నిమిషాల్లోనే చేరువ అవుతుంది.కానీ టికెట్ ధరలు అధికంగా ఉండటం ప్రయాణికులను మెట్రోకు దూరం చేస్తుంది. సిటీ బస్సులో వెళ్తే 20 రూపాయలు అయ్యే టికెట్ ధర మెట్రోలో వెళ్తే 50 నుంచి 60 అవుతుండటంతో చాలామంది ఇబ్బందైనా సరేఅని బస్సుల్లోనే వెళ్తున్నారు. హైదరాబాద్ లో మెట్రో ప్రారంభమై రెండున్నర నెలలు మాత్రమే కావస్తుంది.మొదటి రెండు నెలలు మాత్రమే మెట్రో కళకళలాడింది.కానీ ఆ తర్వాత నుంచి మెట్రో రైలు ఖాళీగా కదులుతోంది.టికెట్ ధరలు సగానికి సగం తగ్గిస్తే కానీ మెట్రోలో ఉరుకులు పరుగుల జోరు పెరగనుంది.లేనిపక్షంలో నగరవాసుల తిప్పలు తప్పవు.
cఈ కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు జర్మనీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెట్రో వంటి అతిపెద్ద రవాణాను ప్రజలకు ఉచితంగా అందించటం ద్వారా సొంత వాహనాల వాడకం తగ్గుతుందని,తద్వారా కాలుష్యం తగ్గుముఖం పట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా,యురోపియన్ యూనియన్ విధించిన వాయుకాలుష్య లక్ష్యాలను చేరుకోలేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.దీన్నుంచి బయటపడాలంటే ప్రజారవాణాను ఉచితంగా అందిచడమే మేలని సర్కార్ భావిస్తోంది.ప్రయాణ భారాన్ని ప్రభుత్వం భరించడమా లేక కార్ల కంపెనీలపై వేయడమా అనేదానిపై ప్రభుత్వం చర్చిస్తోంది.నగరాల్లోని కాలుష్యం తగ్గించాలంటే మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తే సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిస్తున్నారు.దీంతో పాటు నగర శివార్లలోని పట్టణాల్లో కూడా డీజిల్ తో నడిచే పాతవాహనాలను కూడా నిషేధించే విధంగా సర్కార్ చర్యలు చేపట్టనుంది.ఇక అతి త్వరలో మెట్రో ప్రయాణాన్ని ఫ్రీగా అందివ్వనుంది జర్మనీ.మన దేశరాజధాని ఢిల్లీలోనూ కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటికే అక్కడి ఆప్ సర్కార్ సరి బేసి విధానాన్ని అమలు చేస్తోంది.ఇక మన హైదరాబాద్ లోనే కాలుష్యం పెరుగుతూనే ఉంది.రోజురోజుకీ వాహనాలు పెరుగుతుండటం దీనికి కారణం.ఉపాధి కోసం ఇరు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కే వస్తుండటంతో నగర జనాభా పెరుగుతోంది.దానికి తగ్గట్లుగానే వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది.ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే ఖాళీగా తిరిగే మెట్రోకు బదులుగా టికెట్ ధరలు తగ్గించడం ద్వారా మనకూ మంచి జరుగుతుంది కదా..దీని గురించి ముందు ముందే ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందేమో.
Comments
Post a Comment