ఆరెస్సెస్ ఛీఫ్ వ్యాఖ్యల్ని వక్రీకరించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా

బీహార్లోని ముజాఫ్పూర్లో రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్-సంఘచాలక్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా వక్రీకరించింది. 
 
మోహన్ భాగవత్ తన ప్రసంగంలో భాగంగా “ఒకవేళ రాజ్యాంగం అనుమతించిన పక్షంలో సాధారణ ప్రజానీకాన్ని సంసిద్ధం చేయడానికి భారత సైన్యానికి 6 నెలల సమయం పడితే, అదే ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేసే ఆరెస్సెస్ స్వయంసేవకులు సంసిద్ధం కావడానికి 3 రోజుల సమయం పడుతుంది” అంటూ సాధారణ ప్రజలకు, స్వయంసేవకులకు ఉన్న వ్యత్యాసాన్ని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. ఆరెస్సెస్, ఆర్మీల మధ్య పోలికలను తెలుపుతూ చేసిన వ్యాఖ్యలుగా ప్రసారం చేసింది.
 
దీనిపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారత ప్రచార ప్రముఖ్ (మీడియా విభాగం అధిపతి) మన్మోహన్ వైద్య ప్రకటన విడుదల చేశారు.  
By scoures

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!