ప్రధాని ఈ విషయం మీకు చెప్పమన్నారు: చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ ఫోన్

ప్రధాని ఈ విషయం మీకు చెప్పమన్నారు: చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ ఫోన్

ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌ చేశారు. విభజన చట్టంలోని హామీలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారని, ఇవాళ లేదా రేపటిలోగా పరిష్కార మార్గం చూపుతామన్నారని చంద్రబాబుకు రాజ్‌నాథ్ వివరించారు. లోక్‌సభ, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సంయమనం పాటించాలని, ఎంపీలు ఆందోళన విరమించేలా చూడాలని సీఎం చంద్రబాబును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ కోరారు. ‘‘ప్రధాని మోదీ ఈ విషయం మీకు చెప్పమన్నారు. నేను కూడా మీకు హామీ ఇస్తున్నా’’ అంటూ చంద్రబాబుతో రాజ్‌నాథ్‌ మాట్లాడారు.
 
ఫోన్‌లో రాజ్‌నాథ్ మాటలు విన్న తర్వాత సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాభిప్రాయం మేరకే ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారని, తమ పార్టీ ఎంపీలతో మాట్లాడి చెబుతానని రాజ్‌నాథ్‌తో అన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!