అజిత్ ధొవల్ చాణక్యంతొ పూర్తిగా చేతులెత్తేసిన “హిజబుల్ ముజాహిద్దీన్

కాశ్మీర్ వ్యాలి లొ మొన్నటి వరకు తిరుగులేని ఆదిపత్యం చెలాయించిన హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థ, అజిత్ ధొవల్ రంగ ప్రవేశంతొ ప్రస్తుతం కొలుకొలేని స్థితికి చేరుకుంది. ఈ సంస్థకున్న ప్రత్యేక ఏమిటంటే , ఇది పూర్తిగా స్థానిక కాశ్మీరీ యువకులతొ  ISI  స్థాపించిన తీవ్రవాద సంస్థ.  దీనితొ ఈ సంస్థలొ ఉండే వారందరూ అక్కడి స్థానికులే కావడంతొ, వీరికి కాశ్మీరి ప్రజల అండదండలు పుష్కలంగా ఉండేవి. దీనితొ ఈ సంస్థకు 2014 వరకు తిరుగు లేకుండా పొయింది.

అయితే 2014 లొ ప్రభుత్వాలు మారడం, తరువాత అజిత్ ధొవల్ కాశ్మీరు భాద్యతలు చేపట్టిన దగ్గరి నుండి పరిస్తితులు పూర్తిగా మారిపొయాయి. బుర్ఖాన్ వాణి తొ మొదలుకొని సబ్జార్ భట్, సాజిద్ గిల్కర్, అబ్దుల్ ఖయ్యుం లాంటి  టాప్ కమాండర్లతొ సహా హిజబుల్ ముజాహిద్దీన్ కు చెందిన తీవ్రవాదులందరినీ లేపేయడం ప్రారంభించారు. కాశ్మీరు లొ ఏన్ని అల్లర్లు చెలరేగినా ఏక్కడా తగ్గకుండా వీళ్ళ Net Work ను కకావికలం చేయడం ప్రారంభించారు.  వీరికి నిధులు అందే మార్గాలను పూర్తిగా మూసివేయడమే కాకుండా, వారి మద్య కమ్యునికేషన్ లేకుండా చేయగలిగారు.   ఎక్కడా రాజీపడకుండా దొరికినవాడిని దొరికినట్టు లెపేయడం ప్రారంభించారు. అది ఏంతగానంటే ప్రస్తుతం హిజబుల్ ముజాహిదీన్ కమాండర్ గా భాద్యతలు స్వీకరించడానికి ఏవరూ ముందుకు రాకపొవడం విశేషం.

దీనితొ పూర్తిగా పడిపొయిన హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థ చీఫ్ పదవి నుండి సయ్యద్ సలాలుద్దీన్ ను ISI  తొలగించనున్నట్టు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు తెలియజేశాయి. ఇప్పటికే సయ్యద్ సలాలుద్దీన్ ముఖ్య అనుచరులైన ఇంతియాజ్ ఆలం, అమీర్ ఖాన్ లాంటి వారిని ISI  చంపివేసినట్టు భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. దాదాపుగా పూర్తిగా జావగారి పొయి, ఏమీ చేయలేని స్తితికి చేరుకున్న హిజబుల్ ముజాహిద్దీన్ సంస్థను ISI, వేరొక తీవ్రవాద సంస్థలొ కలిపే అవకాశమున్నట్టు భారత నిఘా వర్గాలు తెలియజేశాయి.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!