అంతర్జాతీయ తీవ్రవాది “హఫీజ్ సయ్యద్” కు మరొక షాక్ ఇచ్చిన పాకిస్థాన్

అంతర్జాతీయ తీవ్రవాది  “హఫీజ్ సయ్యద్” కు మరొక షాక్ ఇచ్చిన పాకిస్థాన్

రెండు రొజుల క్రితం మొదటిసారి అంతర్జాతీయ తీవ్రవాది హఫీజ్ సయ్యద్ ను తీవ్రవాదిగా గుర్తించిన పాకిస్థాన్, ఇప్పుడు హఫీజ్ సయ్యద్ కు మరొక షాక్ ఇచ్చింది. హఫీజ్ సయ్యద్ కు చెందిన రెండు అతి పెద్ద సంస్థలైన జమాత్-ఉద్-దావా (JUD), ఫలాహ్-ఇంశానియేట్-ఫౌండేషన్ (FIF) లను Ban చేసి, వాటికి సంబందించిన ఆస్తులను సీజ్ చేస్తుంది.

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ నుండి తమకు స్పష్టమైన ఆదేశాలు రావడంతొ …. హఫీజ్ సయ్యద్ కు చెందిన JUD, FIF సంస్థలకు చెందిన సౌకర్యాలను, ఆఫీసులను, స్కూల్సును, ఆరొగ్య కేంద్రాలను మూసివేస్తున్నట్టు పంజాబ్ (పాకిస్థాన్) న్యాయ శాఖా మంత్రి రాణా సనౌల్లహ్ తెలియజేశాడు.

అయితే పాకిస్థాన్, హఫీజ సయ్యద్ పై చర్యలు తీసుకొవడానికి కారణాలు లేకపొలేదు.

ప్రపంచంలొ మనీ లాండరింగ్ ను, తీవ్రవాద నిధులను అదుపు చేయడానికి శక్తివంతమైన ప్రత్యేక సంస్థ ఒకటి ఉంది. అదే Financial Action Task Force (FATF) . దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్ లొ ఉంది. భారత్ చేసిన కృషితొ 2017, నవంబరు లొ అర్జెంటైనా లొ జరిగిన FATF సమావేశంలొ పాకిస్థాన్ ను కార్నర్ చేసి, తీవ్రవాదం పై ఏటువంటి చర్యలు తీసుకుంటున్నారొ స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, పాకిస్థాన్ కు FATF సమన్లు జారీ చేసింది. ఒక వేళ పాకిస్థాన్ సరయిన చర్యలు తీసుకొని ఏడల పాకిస్థాన్ ను Grey list లొ పెడతామని హెచ్చరించింది.

మరలా మరి కొద్ది రొజులలొ ప్యారిస్ లొ FATF సమావేశం జరగనుండటం, అది కూడా పాకిస్థాన్ ను కార్నర్ చేస్తూ ఈసారి అమెరికా తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుండటంతొ భయపడిన పాకిస్థాన్ ….. హడాఉడిగా ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పాకిస్థాన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల భారత్, అమెరికాలు దేశాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!