అసలు నిజం : రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అంటేనే నిజాయితీ కు , నిజాయితీ అంటేనే పవన్ కళ్యాణ్. మాస్ లో అతని మీద ఉన్న నమ్మకం అంత ఉంది మరి. నిజమే కానీ , పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత అతనిని అభిమానించే వారు, ఎంతో మంది అతనికి రివర్స్ అయిన మాట జగమెరిగిన సత్యం. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ని , నిజాయితీ ని ప్రశ్నించని వారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డబ్బులు లేకుండా ఎలా పోతాయి అని అంటున్నారు.
ఈ అనుమానాలన్నింటికీ తావు ఇచ్చింది పవన్ కళ్యాణ్ చేసిన యాత్రలే కావడం విశేషం. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడి కార్యక్రమాల నిర్వహణకు దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది , అంత ఎందుకు జనసేన పార్టీ ఆవిష్కార సభకు , విశాఖపట్నంలో సభకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్టు అంటారు. ఇవన్నీ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి అని అందరూ అడుగుతున్నారు.
ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కి రియల్ ఎస్టేట్ ద్వారా కూడా కొంత వరకు లాభం చేకూరినట్టు సమాచారం. పార్టీ కోసం ఎంతో కొంత సేకరించడానికి సినిమా కన్నా తేలికైన రంగం , రియల్ ఎస్టేట్ అన్న విషయం పవన్ కళ్యాణ్ కి ఎరుక. దానికి తోడు పవన్ కి బొత్స సత్యనారాయణ తో , బండ్ల గణేష్ తో , మరికొందరు భారీ నాయకులతో మంచి అనుబంధం మొదటి నుండి ఉంది. పివిపి తో కలిసి అప్పట్లో విజయవాడ నుండి అతనికి టికెట్ ఇప్పించడానికి చాలా ప్రయత్నం చేసాడు. తరువాత వీరిద్దరూ విడిపోయినా , దానికి ముందు కొంత వరకు రియల్ ఎస్టేట్ లో మొదటి సారి పాఠాలు నేర్చుకున్నాడు అంట.
అందుకే పవన్ కళ్యాణ్ , రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పరోక్షంగా కాలు పెట్టి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమరావతి ప్రాంతం దగ్గర ఇద్దరు మంత్రుల సహాయంతో కొంత వరకు భూమిని సొంతం చేసుకున్నట్టు , అలానే హైదరాబాద్ పరిసరాల్లో కూడా మూడు చోట్ల పవన్ కళ్యాణ్ కి బిల్డింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు చెబుతున్నారు. ఇవన్నీ కాకుండా హీరోయిన్ సంబందించిన కొన్ని వివాదాలు త్రివిక్రమ్ ని చుట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వారిని కూర్చోబెట్టి సర్ది చెప్పినట్టు ఇది వరకే విన్నాం. దాని వెనుక కూడా పవన్ కళ్యాణ్, ఒక ఇంటిని ఒక హీరోయిన్ కి ఇచ్చిన్నట్టు చెబుతారు.
ఏది ఏమైనా , రాజకీయాలకోసం పవన్ కళ్యాణ్ కాసింత లౌక్యంగా మారడంలో తప్పు ఉందని ఎవరూ అనలేరు. వర్ధమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అత్యంత ప్రజల నమ్మకం ఉన్న నేత. వీలైనంత త్వరగా ఈ పుకార్ల నుండి బయటపడి పవన్ కళ్యాణ్ తిరిగి తన విశ్వరూపం చూపించాలని మనం అందరం కోరుకుందాం.
By sources
Comments
Post a Comment