బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలి: చంద్రబాబు

బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలి: చంద్రబాబు

రాష్ట్రంలో బంద్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. బంద్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. బంద్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనజీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. శాంతియుతంగా బంద్ పాటించేవారికి పోలీసులు సహకరించాలని, అణచివేత చర్యలకు పాల్పడవద్దని సీఎం సూచించారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించాలన్నారు.
 
రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడడం మనందరి బాధ్యత అని ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. బంద్‌లో ఎక్కడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని... వారికి సంఘీభావంగా ప్రజలు బంద్ పాటిస్తున్నారని తెలిపారు. హింసాత్మక శక్తులు బంద్‌లో ప్రవేశించకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Sources Andhra Jyothi

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!