సముద్రంలో ఓలా క్యాబ్.. కస్టమర్ కి మైండ్ బ్లాంక్

మీరు ఓలా కాబ్ లో ప్రయాణించారా? లేక కనీసం కాబ్స్ గురించి అవగాహన అయినా ఉండే ఉంటుంది. మనం నిల్చున్న చోటునుంచే లొకేషన్ ఆన్ చేసుకుని క్యాబ్ లేదా స్కూటర్‌ను బుక్ చేసుకుంటే సరిగ్గా ఐదారు నిమిషాల్లోపే వచ్చి పికప్ చేసుకుంటుంది. ఇక విషయంలోకి వస్తే.. మామూలుగా కాబ్స్ ఎక్కడ నడుపుతారండి.. అదేం ప్రశ్న? రోడ్డు మీద అంటారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేసారు. ఇలా డోర్ టూ డోర్ పికప్ చేసుకుని మనం వెళ్లాల్సిన ప్రాంతానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే తీసుకెళ్తున్నాయి క్యాబ్స్.
అంతేకాదు మనం బుక్ చేయగానే క్యాబ్ ఎక్కడుంది ఇంకా ఎన్ని నిమిషాల్లో మనదగ్గరికి వస్తుంది.. ఎన్ని గంటలకు మనం గమ్యానికి చేరుతుంది వగైరా అన్నీ మొబైల్‌‌లో చూసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రవిచిత్రాలు కూడా క్యాబ్ నుంచి వినియోగదారులు చూడాల్సి వస్తోంది. ఓ ఫేస్‌‌బుక్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసిన ఇమేజ్‌‌ను మీరే చూడండి అసలు విషయమేంటో అర్థమవుతుంది.
సముద్రం మధ్యలో క్యాబ్
హసన్ అనే వ్యక్తి ఫిబ్రవరి-15న ఉబర్ క్యాబ్ బుక్ చేసుకోగా డ్రైవర్ అస్లాం లొకేషన్.. అరేబియన్ మహాసముద్రం మధ్యలో ఉన్నట్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోయిన హసన్ ఆ లోకేషన్ చూపుతున్న విషయాన్ని స్ర్కీన్‌షాట్ తీసి తన ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌‌కు ‘అస్లాం బాయ్ సబ్‌మైరైన్ సే ఆరెలీ హై’ అంటూ ట్యాగ్ చేసి హాస్యం పండించాడు. అంతేకాకుండా అది ఉబర్ క్యాబ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించాడు. ఇప్పుడీ పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను 1700 మంది లైక్ చేయగా 4500 మంది షేర్ చేశారు.‌ పోస్ట్ చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటూ కామెంట్ చేస్తున్నారు.
By sources

Comments