ఉద్యోగులకు నీరవ్ మోదీ లేఖ
ఉద్యోగులకు నీరవ్ మోదీ లేఖ
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తన సంస్థల ఉద్యోగులకు లేఖ రాశారు. ఈ-మెయిల్ ద్వారా ఈ లేఖను పంపించారు. ఇది అధికారిక లేఖేనని ఆయన తరపు న్యాయవాదుల బృందం ధ్రువీకరించింది. ‘‘సమీప భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది’’ అంటూ ప్రారంభమైన ఈ లేఖలో తన సంస్థలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు, రూ.5,700 కోట్ల విలువైన చరాస్తుల స్వాధీనం గురించి ప్రస్తావించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు తనపై ఫిర్యాదు చేయడం వల్ల ‘‘మన సంస్థ ఇబ్బందులు పడుతోంది’’ అని తెలిపారు.
‘‘ప్రస్తుతం, అన్ని ఫ్యాక్టరీలు, షోరూముల్లోని స్టాక్స్‌ను స్వాధీనం చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల మీ బాకీలను చెల్లించే పరిస్థితిలో మేం లేము, మీరు వేరే కెరీర్ అవకాశాల కోసం అన్వేషించడం మంచిది’’ అని పేర్కొన్నారు. దర్యాప్తు వేగంగా జరుగుతున్న తీరుపై నీరవ్ మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘మంచి రోజులొచ్చినపుడు మనం మళ్ళీ కలవలగలమని ఆశిస్తున్నాను. అయితే, స్టాక్స్, బ్యాంక్ ఖాతాలు మళ్ళీ నా చేతికి వస్తే, మీకు చెల్లించవలసిన పాత బాకీలు ఏమైనా ఉంటే కచ్చితంగా చెల్లిస్తానని స్పష్టం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
By sources
Comments
Post a Comment